గంగవ్వ ఇంటికోసం బిగ్ బాస్ ఏంత ఇస్తున్నాడో తెలుసా?

బిగ్ బాస్ నాలుగోవ సీజన్ లో చాల మంది కాంటెస్ట్ లు ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. కానీ ప్రేక్షకుల మధ్యలో నుంచి వచ్చిన గంగవ్వ అందరికి సుపరిచితురాలు. ఇల్లు కట్టుకోవాలని ఆశ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది మన గంగవ్వ. కానీ ఎప్పుడు నలుగురు మధ్యలో వుండే గంగవ్వ ఈ నాలుగు గోడలు మధ్య ఉండలేకపొయింది. ఫేక్ ఎమోషన్స్ చూపించే మనుషుల మధ్య ఉండలేకపొయింది. మట్టి వాసనా పీల్చే ఆమెకు ఏ సి వాసనా పడలేదు. అందరితో కలసి నాలుగు మాటలు చెపుతూ బువ్వ తినే అవ్వకు అక్కడ అన్నం కూడా గొంతులోకి దిగలేదు.అనారోగ్యంగా ఉనప్పటికీ ఇంకో రెండు వారలు ప్రయత్నిచి నెల రోజులుగా కలం నెట్టుకొచ్చింది ఆ నాలుగు గోడల ఇరుకైన ఇంట్లో. కానీ రోజు రోజు కి ఆమె పరిస్థితి దిగజారుతోంది. వరం రోజులుగా ఆమె పరిస్థితి ఏమి బాగాలేదు అని స్వయం గా నాగార్జున నే ప్రకటించాడు.ఆమె హెల్త్ రిపోర్ట్ లని చూసి చలించిపోయిన నాగార్జున ఆమెను బిగ్ బాస్ నుంచి ఇంటికి పంపించామని బిగ్ బాస్ ను కోరాడు.దానికి బిగ్ బాస్ అంగీకరించాడు.

గంగవ్వ బిగ్ బాస్ 4 కి రావడానికి కారణం గంగవ్వ ఇంటిని నిర్మించుకోవాలని కోరిక, గంగవ్వ కి టైటిల్ గెలిచేలని ఎప్పుడు అనుకోలేదు కానీ ఆమె కోరికను నెరవేర్చాలని బిగ్ బాస్ అనుకున్నాడు. గంగవ్వ కు దాదాపు 15 లక్షలు వరకు ఇస్తున్నట్లు విశ్వసియా వర్గాల వార్త వస్తుంది. గంగవ్వకు సాధారణంగా 3 సెంట్ల భూమి వుంది. అందులో గంగవ్వ ఇల్లు నిర్మించుకోవాలని చూస్తుంది. బిగ్ బాస్ స్వయంగా ఆ ఇంటి నిర్మాణం కోసం మరికొంత నగదునుఇవ్వనున్నారు అంట. దానికి నాగార్జున కూడా ఇంకొంచం చిరు సహాయం చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇంటి నిర్మాణానికి ఎం కావాలి అంటే అది నాగార్జునని స్వయం గా పంపిస్తున్నాడు అంట. మొత్తానికి బిగ్ బాస్ మన గంగవ్వ కి బిగ్ బాస్ ఇల్లు కట్టిస్తుంది.