గంగవ్వ కొడుకు ఏమయ్యాడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆపుకోలేరు.

గంగవ్వ కి ౩ సంవత్సరాల వయస్సులో తల్లి, 5 సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించాడు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న గంగవ్వ కి లంబాడీ పల్లి కి చెందిన మేనత్త కొడుకు గంగయ్య పెళ్లిచేసుకున్నాడు. అప్పటి నుండి కష్టాలు అనుభవిస్తున్న గంగవ్వకి ఆ కష్టాలు పెను భూతం లా వెంటాడాయి.


గంగవ్వ భర్త గుడుంబా తాగుడుకు బానిస ఇంట్లో ఎం పట్టించుకునే వాడు కాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక్క కుమారుడు. గంగవ్వ కూలి తోనే అర – కుర జీవనం సాగించేవారు. భర్త సలహా మేరుకు దుబాయి పనికి వెళ్లాలని అప్పుచేసి 50000 ఇచ్చి పంపింది. పనికి వెళ్లిన భర్త జాడ లేదు అయినా క్రుంగి పోకుండా మొదటి కూతురు పెళ్లి ఆమె కన్యాదానం చేసి పెళ్లి చేసింది. చివరికి అత్తా మామ ల మరణం తర్వాత దహన సంస్కారాలు కూడా ఆమె చేసింది. 13 సంవత్సరాల భర్త తిరిగొచ్చిన ఎం లాభం లేక పోయింది.అతను ఏ మాత్రం మారలేదు కానీ గంగవ్వ మంచితనం తో మిగతా ఇద్దరి కుమార్తెలు కుమారుడి పెళ్లిళ్లు చేయగలిగింది.


2012 అక్టోబర్ చివరివారా లో ఆమె జీవితం లో మర్చిపోలేని మార్పు,గంగవ్వ దగ్గరి బంధువు శ్రీరామ్ శ్రీకాంత్ రూపం లో అదృష్టం ఆమె తలుపు తట్టింది. టాయిలెట్ అనే షార్ట్ఫిలిం లో చిన్న పాత్రతో మొదలైన గంగవ్వ జీవితం, తెలంగాణ భాష, గమ్మత్తు మాటలతో ప్రజలందరి ద్రుష్టి ఆకర్షించింది.విదేశాలలో వున్నా మన తెలుగువారి మన్నలను కూడా పొందగలిగింది గంగవ్వ. 2018 లో గంగవ్వ జీవితం ఊహని స్టేజ్ లోకి వెళ్ళింది.ఓ బేబీ సినీహీరోయిన్ సమంత తో ఇంటర్వ్యూ మొదలుకొని విజయదేవరకొండ, బెల్లోమకొండ శ్రీనివాస్, కాజల్ , బిత్తిరి సత్తి మొదలగు సెలెబ్రెటీస్ వారితో చిట్ చాట్ లో పాల్గొంది. పూరిజగన్నాథ్ వాళ్ళ ఇస్మార్ట్ శంకర్ తో సినీరంగ ప్రవేశం తర్వాత మల్లేశం లో కూడా చిన్న పాత్రలు చేసింది.

ప్రస్తుతం శ్రీరామ్ శ్రీకాంత్ సలహా మేరకు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. సెప్టెంబర్ 6 వ తారీఖున మొదలైన బిగ్ బాస్ లో గంగవ్వ కోసమే చూసినవాళ్లు సుమారు 60 % మందియని అంచనా. రెండూ తెలుగు రాష్ట్రాల యువత గంగవ్వకే ఓటు వేయడానికి ఇష్టపడేలా గంగవ్వ ప్రజలులని ఆకట్టుకుంటుంది.ఎన్నో కష్టాల మధ్య నలిగి పోతున్న తన తలరాత ఇంతే అనికోకుండా విధిని సైతం ఎదిరిస్తూ దృఢ సంకల్పం తో విజయం సాధించి మకుటం లేని మహారాణిలా ఎంతో మంది ఆడవారికి స్ఫూర్తిదాయకం గా నిలిచింది.