హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్

ప్రభాస్ అనగానే గుర్తొచ్చేది బాహుబలి ,ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఒక రికార్డు బ్రేక్ చేసింది బాహుబలి, ఆ సినిమాతో ప్రభాస్ మంచి పేరు సాధించారు, అంతే కాదు మిర్చి సినిమాలో “కట్ ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్” అనే డైలాగ్ తో యూత్ కి బాగా నచ్చేసారు. తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరో గా నిలిచారు ఎంతో మంది అమ్మాయిలఫేవరెట్ ఆ హెయిట్ ,పర్సనాలిటీ కి ఎవరైనా పడిపోవాల్సిందే. ప్రభాస్ గారి అసలు పేరు “ఉప్పలపతి వెంకట సూర్యనారాయణ ప్రభు రాజు”,సినీ ఇండస్ట్రీలో అందరు ప్రభుస్ అని పిలుస్తారు, ప్రభాస్ సినీ నిర్మాత యు.సూర్యనారాయణ రాజు మరియు అతని భార్య శివ కుమారికి జన్మించారు,తెలుగు నటుడు “ఉప్పలపతి కృష్ణరాజు ” గారి మేనల్లుడు. ప్రభాస్ భీమావరం లోని డిఎన్ఆర్ స్కూల్లో చదివి, బిటెక్ హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాల నుండి డిగ్రీ పూర్తీ చేసారు. ప్రభాస్ 2002 లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు మాస్ రోల్ లో నటించారు ,త్రిష తో వర్షం సినిమాలో లవర్ బాయ్ గా అమ్మాయిల మనసులు గెల్చుకున్నారు, ఆ సినిమాలో మంచి పేరు సంపాదించారు.

ఆ తరువాత చత్రపతి సినిమా కి కూడా మంచి రెస్పొన్సె వచ్చింది,చక్రం, పౌర్ణమి, అడవి రాముడు యోగి,మున్నా,బిల్లా, కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి,డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మరియు మిర్చి ,సాహూ , ఎస్. ఎస్. రాజమౌలి యొక్క పురాణ యాక్షన్ చిత్రం బాహుబలి: ది బిగినింగ్ లో ప్రభాస్ టైటిల్ రోల్ పోషించారు.ఇది ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన 4 వ భారతీయ చిత్రం.ప్రభాస్ తన సీక్వెల్ బాహుబలి 2: ది కన్‌క్లూజన్ లో తన పాత్రను తిరిగి పోషించాడు, ఇది కేవలం పది రోజుల్లో అన్ని భాషలలో ₹ 1,000 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది మరియు ఇది రెండవ అత్యధికం- ఇప్పటి వరకు భారతీయ చిత్రం వసూలు చేసింది.

బెస్ట్ ఫింఫరే అవార్డు,నంది అవార్డు ,సీమ అవార్డు లు గెల్చుకున్నారు ,”రాధే శ్యామ్” రాబోయే రొమాంటిక్ డ్రామా చిత్రం, ప్రభు మరియు పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రాధా కృష్ణ కుమార్ రచన మరియు దర్శకత్వం వహించారు.తెలుగు మరియు హిందీ లో రిలీజ్ అవబోతుంది.ప్రస్తుతం కోవిడ్ వాళ్ళ షూటింగ్ లు నిలిపి వేశారు సినిమా వాయిదా పడింది. ప్రభాస్ సినిమాలు ఏ కాకుండా మహీంద్రా టియువి 300 కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా సంతకం చేసిన ప్రభాస్, తమ కొత్త ప్రకటనతో టెలివిజన్ కమర్షియల్ (టివిసి) రంగంలో అడుగుపెట్టారు,మరి ఎన్నో హిట్స్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉండాలని కోరుకుంటున్నాము .