హీరో సుమంత్ అశ్విన్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నారు అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మన తెలుగు ఇండస్ట్రీ లో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ అనగానే గుర్తొచ్చేది కేరింత సినిమా ఆ సినిమాతో లవర్ బాయ్ అని మంచి ఫేమ్ పొందారు.. 2012 లో తూనీగ తూనీగ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.. రెండవ సినిమా 2013 లో అంతకు ముందు ఆ తరువాత ,లవర్స్, చక్కిలిగింత, కేరింత, కొలంబస్, రైట్ రైట్, ఎందుకిలా, ఫ్యాషన్ డిజైనర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమ కథ చిత్రం 2 వంటి సినిమాలో నటించారు.. ప్రస్తుతం ఇపుడు ఇదే మా కథ సినిమా ప్రారంభం అవుతుంది ఎందుకిలా వెబ్ సిరీస్ ఓ.టీ.టీ ప్లాటుఫార్మ్ లో యూప్ టీవీ లో ప్రసారం అవుతుంది.. అయితే ఈ సినిమాలు ఏవి అశ్విన్ కి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

సుమంత్ తండ్రి ఎం.ఎస్. రాజు ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అతను ఒక్కడు సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు మరియు నంది అవార్డు కూడా పొందారు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకి 3 ఫిలింఫేర్ అవార్డు లు కూడా సాధించారు మంచి హిట్స్ సినిమాలు తీశారు అలానే మనసంతా నువ్వే, నీ స్నేహం, దేవి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.. తన దర్శకత్వం లో వచ్చిన తూనీగ తూనీగ సినిమాకి తన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరో గా నటించాడు అయితే ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేసి డైరెక్టర్ గా డర్టీ హరి,వాన, తూనీగ తూనీగ సినిమాలు తీశారు అలా చాలా సినిమాలో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు సాధించారు.

ఇక తండ్రి కి వచ్చినంత గుర్తింపు అశ్విన్ కి రాలేదు కానీ అడివి దర్శకత్వం వచ్చిన దిల్ రాజు నిర్మించిన అశ్విన్ నటించిన కేరింత సినిమాలో బాగా గుర్తింపు తెచ్చింది, మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అశ్విన్ రెండవ సినిమాకి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ సౌత్ ఆఫ్రికా లో బెస్ట్ ఫిలిం గా నామినెటే అయ్యింది.. సుమంత్ అశ్విన్ సినిమాలో రాకముందు సుమంత్ వాళ్ల తండ్రి రాజు గారితో కలిసి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో పని చేసాడు.. ఇలా సినిమాలో కాస్త గ్యాప్ ఇచినప్పటికీ ఇపుడు ఒక టాపిక్ మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అశ్విన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి, నిర్మాత ఎం.ఎస్ రాజు గారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అని టాక్ వినిపిస్తుంది అయినా కొడుకు సుమంత్ అశ్విన్ తొందరలో ఒక ఇంటివారు కాబోతున్నారు దీపికా అనే అమ్మాయితో ఫిబ్రవరి 13న వివాహం జరగున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పెళ్లి గురించి ప్రకటన మాత్రం ఇంతవరకు బయటకి రాలేదు ఇంకో వారం సమయం ఉంది కాబ్బటి మీడియా కి బహిరంగంగానే చెప్పి వివాహాన్ని గ్రాండ్ గా చేసుకుంటారో లేదో చూడాలి, ఇంతకీ ఇది నిజం అయితే గత ఏడాది చాలామంది సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ ఈ ఏడాది 2021 లో మొదటి పెళ్లి చేసుకోబోతున్న మొదటి హీరో సుమంత్ అశ్విన్ అవ్వచ్చు అయితే ఈ వార్త ఇపుడు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.