రజనీకాంత్ రాజకీయ పార్టీ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు….

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు అయిన అసలీ పేరు శివాజీ రావు గాఎక్వాడ్ రజని కాంత్ గారు మరాఠీ కుటుంబానికి చెందిన వారు ఇంట్లో మరాఠీ భాషలో మాట్లాడుతూ బయట కన్నడ లో మాట్లాడుతూ పెరిగారు అతని తండ్రి రామోజీ రావు ఒక పోలీస్ కానిస్టేబుల్.తన ప్రాధమిక విద్యను బెంగళూరు లోని గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ స్కూల్ లో చదివారు అలానే ఆటలో క్రికెట్,ఫుట్ బాల్,బాస్కెట్ బాల్ పై గొప్ప ఆసక్తి తో నేర్చుకుని ఆడేవారు రోజు పాఠశాల పూర్తీయిన తరువాత బస్సు కండక్టర్ గా బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్(బీటీఎస్) లో ఉద్యోగం పొందే ముందు కూలి గా మరియు అనేక చాలా ఉద్యోగాలు చేసారు.

కన్నడ నాటక రచయత టోపీ మునియప్ప తన పౌరాణిక నాటకాల్లో నటించడానికి అవకాశం ఇచ్చిన తరువాత నాటకాల్లో అవకాశం ఇచ్చిన తరువాత నాటకాల్లో పాలుగోన్నాడు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఒక ప్రకటన వచ్చిన తరువాత యాక్టింగ్ కోర్స్ చేపట్టాలని నిర్ణయించుకున్నాడు.తమిళ్ ,కన్నడ,తెలుగు భాషలో నటించాడు. సినిమాలోకి రాకముందు బెంగళూరు లో వాట్స్ పోలో బస్సు కండక్టర్ గా పని చేసారు,మొట్ట మొదట రజనీకాంత్ గారు హిందీ సినిమాలో అడుగు పెట్టారు ఆంధ కానూన్ అనే పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారితో జత కట్టారు అలానే ముకుల్ ఆనంద్ హమ్ తో మరోసారి హిందీ చిత్రాల్లో అమితాబ్ గారితో నటించారు.

అంతులేని కథ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చారు మరియు బాలచందర్ దర్శకత్వం లో వచ్చిన మూండ్రు ముడుచు తమిళ్ సినిమాలో నటించారు,అలా ప్రతిష్టాత్మక పేరు సంపాదించారు ,గవర్నమెంట్ ఆయనకి పద్మ భూషణ్ మరియు పద్మ విభూషణ్ సత్కరించారు.ఎన్నో నేషనల్ అవార్డ్స్,ఫిలింఫేర్ అవార్డ్స్,4 విజయ అవార్డ్స్,45 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా లో “ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ కోసం సెంటినరీ అవార్డు లభించింది,అలా చాలా సినిమాలకి అవార్డ్స్ తో పాటు ప్రజల మనసు గెల్చుకున్నారు.

సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన బాషా చిత్రం రజినీకాంత్ గారు కెరీర్ లో వాణిజ్య విజయాన్ని సాధించింది తమిళనాడు లో ప్రత్యేక దేవుడులాంటి హోదాను సంపాదించారు మరియు శివాజీ సినిమా 100 కోట్ల పైగా ప్రవేశించిన మొదటి భారతీయ చిత్రం అందులో శివాజీ పాత్ర కోసం 26 కోట్లు సంపాదించారు,జాకీ జాన్ తరువాత ఆసియ లో అత్యధిక పారితోషకం పొందిన నటుడు మన రజనీకాంత్ గారు అలా సినిమా రంగం ఇప్పటికి అధిక స్థాయిలో ఉన్నారు.

రజనీకాంత్ గారు రాజకీయ ఎంట్రీ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రత్యేస్యంగా కాకపోయిన పరోక్షంగా రజనీకాంత్ గారు రాజకీయాల్లో ఉన్నారు అని రాజకీయాల్లో మంచి ఆశయం తో వచ్చేవాళ్లని స్వాగతించాలి అంటు ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో తెలియ చేసారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో రాకముందు నుంచి రజనీకాంత్ గారు పాలిటిక్స్ లో రావాలని చాలా మాటలు నడిచాయి.ప్రస్తుతం రజనీకాంత్ గారు ట్విట్టర్ లో ఒక ప్రకటన చేసారు తన పార్టీ ని “అవినీతి రహిత నిజాయతి ,పారదర్శక మరియు అత్యధిక రాజకీయాల్లో లౌకిక పార్టీ అని అన్నారు,ఈ నెలలో పార్టీ పేరు ప్రకటిస్తాం అన్నారు సినిమాలో మంచి పేరు సంపాదించినట్టు రాజకీయాల్లో కూడా ఇంకా గొప్ప పేరు ప్రతిష్టాత్మక సంపాదిస్తారని కోరుకుందాం.