మళ్లీ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకి రాబోతున్నారు…

వెండి తేరా పైనే కాకుండా బుల్లి తేరా మీద విశేషం గా అక్కటుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా కనిపించేందుకు సిద్దం అవుతున్నారు. బిగ్ బాస్ 1లో హోస్ట్ గా మారిన ఎన్టీఆర్ అభిమానుల ఆదరణ చేరుకున్నారు గత రెండు సంవత్సరముల బుల్లి తేరాకి దూరం అయిన ఎన్టీఆర్ మరోసారి రికార్డు స్థాయి టీఆర్ పి ని సాదించేందుకు, ప్రముఖ టెలివిషన్ సమస్త రంగం సిద్ధం చేసింది. తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభించిన సమయం లో సీసన్ 1 కోసం ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లి తేరా మీద ఎంటర్ అయ్యారు కేవలం హోస్ట్ గానే కాకుండా బిగ్ బాస్ షో కి పాపులారిటీ ని క్రేజ్ ని సంపాదించి పెట్టారు.

బిగ్ బాస్ రియాలిటీ షో కి దూరం కావడం తో రెండో సీసన్ కు నాని తరువాత సీసన్ కి అక్కినేని నాగార్జున ఇప్పటివరకు వ్యవహిస్తునారు. మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షో కు హిందీ లో అత్యంత రేటింగ్ ఉన్నపటికీ తెలుగు లో మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందటం లో దారుణంగా విఫలం అయింది, తరువాత నాగార్జున కొంత బెటర్ రేటింగ్ ని సాధించారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా నిర్వహించి సీసన్ కి దారుణమైన రేటింగ్ నమోదు చేసుకుంది అన్ని రకాల క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ ను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి తాజాగా బిగ్ బాస్ షో కి హోస్ట్ గా కాకుండా అత్యంత ప్రేక్షకుల ఆదరణ ఉన్న హిందీ లో కౌన్ బనేగా క్రోర్పతి షోకు ఇపుడు తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా మన ముందుకి రాబోతున్నారు.

ఎన్టీఆర్ ని ఒప్పించడం లో జెమినీ తెలివిషన్ తనడైన స్టైల్ లో పాము ని కదిపింది, తనకి ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణం గా ముందు అంగీకరించలేదని తెలుస్తుంది. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ ను సరికొత్త ఫార్మేట్ లో తెరపైకి తెచ్చేందుకు ప్లన్స్ వేశారు గేమ్ ఫార్మాట్ నే పూర్తిగా మార్చేశారు మరింత కొత్తగా ఆకర్షణీయంగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు టైటిల్ ని కూడా మర్చి సరికొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ మేరకు యూత్ ని ఆకర్షించే విదంగా గేమ్ ని రుపొందిస్తున్నారు ఇక ఈ షో కి ఎన్టీఆర్ బర్రిగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోస్ మన ముందుకి వచ్చినప్పటికి , బిగ్ బాస్ రియాలిటీ షో టాప్ రేటెడ్ లో నిలుస్తుంది, ఇంతకముందు బిగ్ బాస్ మొదలు అవ్వకముందు జబర్దస్త్ హిట్ రేటెడ్ గా ఉండేది అంటే కాదు మీలో ఎవరు కోటీశ్వరుడు, కొంచెం టచ్ లో ఉంటె చెప్తా, మాయాద్వీపం, కాష్, ఢీ డాన్స్ షోస్, అలీతో సరదాగా, జీన్స్, పాడుతా తీయగా, నీతోనే డాన్స్, సూపర్ సింగెర్స్, భలే చాన్సులే, ఇష్మార్ట్ జోడి, F3, పెళ్లి చూపులు టాలీవుడ్ స్క్వేర్, వైఫ్ చేతిలో లైఫ్ వంటి చాల షోస్ మనలోని అలరించాయి కొన్ని బాగా హిట్స్ అయినప్పటికీ కొన్ని త్వరగా ప్లాప్ అయ్యాయి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి చాలా షోస్ తో మన ముందుకి వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలో బిజీ ఉన్నపటికీ మనకోసం షో చేయబోతున్నారు.

తెలుగు లో ఏ హీరో ఇప్పటివరకు అందుకోనంత గా బర్రి పారితోషకం ని ఇస్తున్నారట, ఈ రెమ్యూనిరేషన్ విష్యం బుల్లితేరా చరిత్రలోనే ఇటు సౌత్ ఇండియాలోనే మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోయే సరికొత్త కేబీసీ తెలుగు వర్సిన్ స్టార్ మా టీవీ నుంచి వేరే ఛానల్ కి షిఫ్ట్ కావడం కూడా చర్చ జరుగుతుంది.తెలుగు టెలివిషన్ రంగం లో టాప్ పోసిషన్ కోసం ఛానెల్స్ మధ్య పోటీ జరుగుతుంది,బ్రాండ్ న్యూ షోను జెమినీ ఛానల్ దక్కించుకోడం ఇపుడు ఆశక్తికరంగా మారింది, దీనితో తెలుగు బుల్లి తేరా రంగం లో కొత్త పోటీకి తేరా లేచిందనే చెప్పాలి.