Kanguva Review Telugu కోలీవుడ్ నటుడు వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. ఈ మూవీ ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది.
సిరుత్తై శివ దర్శకత్వంలో గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, కేఎస్ రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ ఆలీ ఖాన్, రవి రాఘవేంద్ర, బోస్ వెంకట్ తదితరులు నటించారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల పై, జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఇటీవల కంగువ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, రెండు ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. ఇక టీజర్, ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు మనకి అర్ధమవుతుంది.
Kanguva Review Telugu
ఇక ఈ మూవీకి దేవిశ్రీ అందించిన సాంగ్స్ అయితే శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్య మూవీ చాలా రోజుల తరువాత థియేటర్స్ లోకి వస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ అటు తమిళనాడు తో పాటు తెలుగు సహా పలు ప్రాంతాల్లో ఎంతో సందడి చేసారు. ఇక నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన కంగువ మూవీ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంటోంది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
కంగువ మూవీ కథలోకి వెళితే గోవాలో ఒక బౌంటీ హంటర్ గా పనిచేస్తుంటాడు ఫ్రాన్సిస్ (Suriya). అతడు తన గర్ల్ ఫ్రెండ్ ఏంజెలినా (Disha Patani) తో పాటు మరొక ఫ్రెండ్ కోల్ట్ 95 (Yogi Babu) తో కలిసి ఈ బౌంటీ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే కొన్నాళ్ల అనంతరం యాంజెలీనాతో ఫ్రాన్సిస్ కి గొడవ అవుతుంది.
కాగా కొన్నాళ్ల కాపురం తరువాత వారిద్దరూ కలిసి ఒక బౌంటీ ఒప్పుకుంటారు. అయితే ఆ పని సమయంలో అనుకోకుండా అక్కడ ఒక కుర్రాడిని చూస్తాడు ఫ్రాన్సిస్, అలానే అతడితో తనకు ఏదో తెలియని జన్మ జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. కాగా ఆ బంధం ఈనాటిది కాదు, గత జన్మదని తెలుసుకుంటాడు ఫ్రాన్సిస్. ఇక అక్కడి నుండి కథ మొత్తం 1000 సంవత్సరాల వెనక్కి వెళుతుంది. అక్కడ కొన్ని జాతులు, తెగల వారు, వారి మధ్య పలు యుద్దాలు, విన్యాసాలు, వారి తెగ నాయకుడు కంగువ చేసే పోరాటాల తాలుకు మిగతా సారాంశమే ఈ మూవీ యొక్క మిగతా కథ.
Kanguva Review Telugu
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా కంగువ మూవీ కథలో ప్రధాన బలం హీరో సూర్య. అటు ఫ్రాన్సిస్, ఇటు కంగువ రెండు పాత్రల్లో కూడా మరొక్కసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు సూర్య. పలు కీలక యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో సూర్య యాక్టింగ్ నిజంగా సూపర్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ దిశా పటాని పాత్ర కూడా అభినయానికి తగ్గట్లుగా బాగుంది. ఆమె ఉన్న సన్నివేశాలు బాగున్నాయి.
ముఖ్యంగా యోలో, నాయకా సాంగ్స్ సూర్య ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరిస్తాయి. యోలో రొమాంటిక్ గా యువత ని ఆకట్టుకుంటే, నాయక సాంగ్ ఎమోషనల్ గా అందరి మనసులు తాకుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం బాగుంది. మరీ ముఖ్యంగా కెమెరా మ్యాన్ వెట్రి పళనిస్వామి అందించిన విజువల్స్ ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయి.
Kanguva Review Telugu
అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఆడియన్స్ ని అలరిస్తాయి. ఎడిటింగ్ విభాగం పని తీరు కూడా బాగుంది. నిర్మాతల భారీ నిర్మాణ విలువలు మూవీకి మరొక ప్లస్ గా చెప్పుకోవచ్చు. ఇక దర్శకుడు శివ కథ, కథనాలను నడిపిన తీరు బాగుంది. కథనం ఊహాజనితామా ఉన్నా, అక్కడక్కడ కొన్ని సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఇక ఇటువంటి రెండు కాలాల్లో సాగే ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ ని తీయాలి అంటే దర్శకులకు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే రెండు కాలాల్లో కథ, కథనాలను ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా కనెక్ట్ చేయగలగాలి. ఆ విధంగా డైరెక్టర్ సక్సెస్ అయినప్పటికీ అక్కడిక్కడ కొంత సాగతీతగా అనిపిస్తుంది.
ఇక కథనంలో కూడా పలు లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కొంత నెమ్మదిస్తుంది. అయితే భారీ యాక్షన్ విజువల్ మూవీస్ కోరుకునే వారికి అది నచ్చవచ్చు. క్లైమాక్స్ లో ఒక ప్రముఖ నటుడి క్యామియో బాగుంది, అయితే దానిని సెకండ్ పార్ట్ కి ఎలా లీడ్ చేస్తారనేది చూడాలి.
Kanguva Review Telugu
తీర్పు :
మొత్తంగా నేడు ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కంగువ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ కి ఈ మూవీ మరింత బాగా నచ్చుతుంది. సాధారణ ఆడియన్స్ ని అలరించే పలు ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి.
అక్కడక్కడా కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా అయితే కంగువ మంచి సక్సెసర్ అని చెప్పాలి. ముఖ్యంగా సూర్య వన్ మ్యాన్ షో ఈ మూవీకి అతి పెద్ద బలం. రాక్ స్టార్ దేవిశ్రీ నేపధ్య సంగీతం, గ్రాండియర్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఒకవేళ ఈ వారాంతంలో ఫ్యామిలీ తో కలిసి మంచి మూవీ చూడాలంటే కంగువ పై ఒక లుక్ వేసేయొచ్చు.
మరి నేడు మంచి మౌత్ టాక్ సంపాదించి ఓపెనింగ్స్ పరంగా కూడా బాగానే కలెక్షన్ రాబట్టే అవకాశం ఉన్న కంగువ మూవీ, నేటి నుండి క్లోజింగ్ వరకు ఎంతమేర కలెక్షన్ రాబడుతుంది, ఏ స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి. కాగా ఈమూవీ బ్రేకీవెన్ చేరుకోవాలి అంటే రూ. 400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి కంగువ ఓవరాల్ గా ఎంత రాబడుతుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
తెలుగు ఫిల్మీ రేటింగ్ : 3.5 / 5