Keerthi Suresh Images తెలుగు స్టార్ నటి కీర్తి సురేష్ యొక్క తాజాగా లేటెస్ట్ ఇమేజెస్ కోసం ఎప్పటికప్పుడు మా సైట్ ని వీక్షిస్తూ ఉండండి. ఇక తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా యువ నటుడు రామ్ హీరోగా కిశోర్ తిరుమల తీసిన నేను శైలజ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు కీర్తి సురేష్. ఆ మూవీలో శైలజ పాత్రలో కీర్తి సురేష్ నటన, అందం అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా అప్పట్లో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్న ఈ మూవీ ద్వారా బాగానే క్రేజ్ సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్. నిజానికి అంతకముందు సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ తో ఐనా ఇష్టం నువ్వు అనే మూవీ చేసారు కీర్తి. అయితే అప్పట్లో కొన్ని కారణాల రీత్యా ఆ మూవీ రిలీజ్ కాలేదు. ఇక నేను శైలజ అనంతరం ఒక్కొక్కటిగా కీర్తి కి తెలుగులో మంచి అవకాశాలు రాసాగాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి మూవీలో నటించి అలరించారు కీర్తి సురేష్. అందులో ఆమె ఒక హీరోయిన్ గా నటించి మెప్పించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ గా నిల్చింది. ఇక యువ నటుడు నానితో ఆమె చేసిన నేను లోకల్ మూవీ మంచి విజయం అందుకుని మంచి పేరు తీసుకువచ్చింది. సరిగ్గా అదే సమయంలో వైజయంతి మూవీస్ సంస్థ పై యువ దర్శకుడు నాగ అశ్విన్ తీసిన మహానటి మూవీలో నటించే అవకాశం కీర్తి సురేష్ కి లభించింది.
Keerthi Suresh Images HD
ఒకప్పటి దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఆ మూవీలో టైటిల్ రోల్ పోషించి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు కీర్తి. అప్పట్లో ఆ మూవీ పెద్ద విజయం అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి అవార్డు కూడా తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కీర్తి కి అవకాశాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె చేసిన సర్కారు వారి పాట మూవీ మంచి విజయం అందుకుని బాగా పేరు తీసుకువచ్చింది.
అలానే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు 2 లో ఒక హీరోయిన్ గా కొన్ని క్షణాలు కనిపించి అలరించారు కీర్తి. అటు తమిళ్ లో ఇలయదళపతి విజయ్ తో సర్కార్, యాక్షన్ హీరో విశాల్ తో పందెం కోడి 2, చియాన్ విక్రమ్ తో స్వామి స్క్వేర్ మూవీస్ చేసి తమిళ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు ఆమె.
ఇక ఆపైన తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అయిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు చేసి వాటి ద్వారా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు అందుకున్నారు ఆమె. అవి ఆమెలోని నటిని మరింతగా ఆడియన్స్ కి పరిచయం చేసి బాగా పేరు అందించాయి. ఇక ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ తీసిన పెద్దన్న తో పాటు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తీసిన దసరా సినిమాల్లో కూడా నటించి ఆమె మరొక రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు.
వాటితో పాటు ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందిన భోళా శంకర్ లో మెగాస్టార్ సోదరి పాత్రలో నటించి మెప్పించారు కీర్తి సురేష్. తమిళ నటుడు జయం రవి హీరోగా రూపొందిన సైరెన్ తో పాటు ఇటీవల నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి మూవీలో బుజ్జి అనే కారుకి తన వాయిస్ ని అందించి తద్వారా కూడా ఆడియన్స్ ని మెప్పించారు కీర్తి సురేష్.
Keerthi Suresh Images Latest
అటు తమిళ్ లో ఆమె ప్రధాన పాత్రలో తాజాగా రూపొందిన రఘు తాత మూవీ కూడా బాగానే విజయవంతం అయింది. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో రివాల్వర్ రాణితో పాటు తొలిసారిగా ఆమె బాలీవుడ్ లోకి బేబీ జాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల తమిళ నటుడు విజయ్ తో అట్లీ తీసిన సూపర్ హిట్ మూవీ తేరికి ఇది అఫీషియల్ రీమేక్. కలీస్ తీస్తున్న ఈ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నారు.
అలానే వీటితో పాటు కన్నివేడి మూవీ కూడా చేస్తున్నారు కీర్తి. మొత్తంగా తనకు కెరీర్ పరంగా అన్ని భాషల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని తద్వారా నటిగా గొప్ప పేరుని ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క ప్రేమని సొంతం చేసుకుని హీరోయిన్ గా దూసుకెళ్తున్నారు కీర్తి సురేష్.ఇక ఎప్పటికప్పుడు ఇతర నటీనటుల మాదిరిగా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫ్యాన్స్ తో అలానే ఆడియన్స్ తో టచ్ లో ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు కీర్తి సురేష్.
Keerthi Suresh Images Beautiful Stills
ముఖ్యంగా తన యొక్క లేటెస్ట్ ఫోటోలు, ఫోటో షూట్ వీడియోస్ ని కూడా ఆమె వాటి ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కీర్తి యొక్క ఫొటోస్ కి సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది. ఇక ముఖ్యంగా నటిగా తాను ఈస్థాయికి చేరడానికి ఎందరో ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క ఆదరణతో పాటు తల్లితండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతో ఉందని, అలానే తనకు కెరీర్ పరంగా ఎంతో మంచి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న నటీ నటులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తారు కీర్తి.
ఎప్పుడూ తనువు, మనసు ప్రశాంతంగా పాజిటివ్ గా ఉంచుకుంటే ఎంతటి పనిలో అయినా మెల్లగా విజయం సాధించవచ్చని, అలానే చక్కని డైట్ తో పాటు నిత్యం యోగ, వ్యాయాయం వంటివి మనల్ని అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉంచుతామని ఆమె చెప్తారు. మరి నటిగా కీర్తి సురేష్ రాబోయే రోజల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం