మహా నటి కీర్తి సురేష్ కి మెగా విషెస్

కీర్తి సురేష్ అనగానే మనకి గుర్తొచ్చేది “మహానటి” సావిత్రమ్మ , బయోపిక్ మహానటి (2018) లో నటి సావిత్రి పాత్ర పోషించినందుకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆవిడా చేసిన యాక్టింగ్ ఎంతోమంది హృదయాల్ని గెల్చుకున్నారు,ఒక్కప్పుడు సావిత్రి అమ్మ గారిని చూసినట్టు ఉందని ప్రసంశలు వచ్చాయి.ఈ ఒక్క సినిమా తో టాప్ రేటింగ్ హీరోయిన్ గా నిలిచారు.

కీర్తి తండ్రి నిర్మాత జి. సురేష్ కుమార్ ,తల్లి మేనకా కుమార్ , అక్క రేవంతి సురేష్ ఉన్నారు.అప్పట్లో మేనకా గారు కూడా సినీ నటి మరియు నిర్మాత తమిళ చిత్రంలో తొలి సినిమా ‘రామాయి వయసుక్కు వంతుత్తా’ మేనకా 116 చిత్రాలలో నటించారు, ఎక్కువగా మలయాళంలో. తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసింది.

కీర్తి 2000 ల ప్రారంభంలో, కీర్తి తన తన తండ్రి ప్రొడక్షన్స్ లో బాల నటిగా పనిచేశారు,మరియు ఫ్యాషన్ డిజైన్ చదివిన తరువాత సినిమాలో కి తిరిగి వచ్చాడు.2013 లో మలయాళ చిత్రం గీతాంజలిలో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది,నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు ,నేను లోకల్,అజ్ఞాతవాసి ,2020 లేటెస్ట్ గా పెంగ్విన్ థ్రిల్లర్ సినిమా తెలుగు ,తమిళ బాషా లో రిలీజ్ అయింది, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కీర్తి సురేష్ యాక్టింగ్ మాత్రం బాగా చేసారు.

కీర్తి సురేష్ సోషల్ నెట్వర్క్ లో బాగా ఆక్టివ్ గా ఉంటారు,ఇపుడు రంగ్ దే,సర్కారు వారీ పాటా మూవీ షూటింగ్ లో బిజీ ఉన్నారు.తెలుగు ఇండస్ట్రీ లో కీర్తి సురేష్ మంచి పేరు సంపాదించారు,అంతే కొనసాగాలని కోరుకుంటున్నాము.