బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ లో డైరెక్టర్ సూర్య కిరణ్ ఒకరు. అయన దర్శకత్వం వహించి చాల ఏళ్ళు అవుతుంది. సుమారు 17 ఏళ్ల క్రితం సుమంత్ హీరో గ తీసిన ” సత్యం ” చిత్రం ఒక్కటే అతని కెరీర్ లో హిట్ గ నిలిచింది.
సూర్య కిరణ్ దర్శకుడిగా కెరీర్ లో పైకి రాలేకపోయారు. అలానే అతన వేక్తిగత జీవితం లో కూడా సంతోషాలని చూడలేదు. హీరో రవి తేజ తో నటించిన ” అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడరు” చిత్రం లో హీరోయిన్ గ కళ్యాణి అలియాస్ కావేరి ని సూర్య కిరణ్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లూ ఇద్దరు పెళ్లి తరవాత కలిసి లేరు. విడాకులు తీసుకోనప్పటికీ ప్రైవేట్ గ ఎవరికి వాళ్ళు ఉంటున్నారు.
కానీ అతను మాట్లాడే విధానము వాలా మొదటి వారమే ఎలిమినతె అయ్యాడు. తన డైరెక్షన్ సినిమా లోనే కాకుండా ఇంట్లో కూడా చేయడం వాళ్ళ తొందరగా ఎలిమినతె అయ్యారు అని ప్రేక్షకుల అభిప్రాయం. ఆయన బిగ్‌బాస్ షో గురించి, వాళ్లిచ్చే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కళ్యాణిని ఇతర ఇంటి సభ్యులు ఆడుకుంటున్నా, అది ఆమెకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక మొదటి వారంలో ప్రేమలేవీ చిగురించలేవంటూనే అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని తెలిపాడు. దీని గురించి ఇంట్లో నుంచి వచ్చేముందు మోనాల్‌ను హెచ్చరించానన్నాడు.
రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారనేది చెప్పొచ్చో, లేదో నాకు తెలీదు. కానీ నాకైతే చాలానే ఇచ్చారు. అడిగిన దానికి 10 రెట్లు ఎక్కువే ఇచ్చారు అని చెప్పచు . ఒక్క వారం రోజులు ఉన్నందుకు లక్షల్లో ఇచ్చారు. ఈ డబ్బుతో ఐదారు నెలలు బతికేయొచ్చు. నాకొక్కరికి మాత్రమే కాదు, అందరికీ బాగానే ఇచ్చారు. నిజానికి ఒక వారమే కదా ఉన్నది.. ఏమైనా ఇస్తారా అని కొంత అడిగితే, ఇచ్చేది చాలా వుందంటూ పెద్ద మొత్తంలో సర్దారు. ఇక హౌస్‌లో కూడా ఉండాలని అనిపించలేదు. కానీ తొలివారం ఎలిమినేషన్ ఉండదనుకున్నాను. ఇకపోతే అమ్మ రాజశేఖర్ జెన్యూన్ పర్సన్, నాలాంటి వాళ్లు ఒకరు లోపల అతడికి సాయంగా ఉంటే బాగుండు. లేదంటే హౌస్‌లో ఉన్నవాళ్లు ఆయనపై ఎక్కేస్తారు. హౌస్‌లో అమాయకులు ఎవరూ లేరు అని సూర్యకిరణ్ చెప్పుకొచ్చారు.