Mahesh Babu Latest Movies టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారిగా రాజకుమారుడు మూవీ ద్వారా చిత్రసీమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఫస్ట్ మూవీతోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి తగ్గ తనయుడిగా గొప్ప క్రేజ్ ని ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించారు మహేష్. ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన రాజకుమారుడు మూవీని కె రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా అనేక సినిమాలతో దూసుకెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక్కో సినిమాతో హీరోగా తన సినీ క్రేజ్ ని టాలీవుడ్ సినీ పరిశ్రమలో అమాంతం ఎన్నో కోట్ల రేట్లు పెంచుకుంటూ సాగారు.
ముఖ్యంగా ప్రతి చిత్రంలో నటుడిగా అద్భుతంగా పలు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ మహేష్, కెరీర్ పరంగా ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు పలు ఇండస్ట్రీ హిట్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఒక్కమాటలో కోట్లాది ఫ్యాన్స్ ఆడియన్స్ చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైనా కెరీర్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఫెయిల్ అయ్యాయి తప్ప ఆయన నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదనేది వాస్తవం.
ఇక ఇటీవల కెరీర్ పరంగా వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ముఖ్యంగా ఆరేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భరత్ అనే నేను (Bharat Ane Nenu) తో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్. ఆ తరువాత వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మహర్షి (Maharshi) తో కూడా మరొక విజయం అందుకున్నారు.
అనంతరం సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఆపైన మరొక యువ దర్శకుడు పరశురాం పెట్లతో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మూవీ చేసారు మహేష్. ముఖ్యంగా ఓపెనింగ్స్ నుండి నెగటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ ఆ మూవీ ఫైనల్ గా సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ తో మంచి విజయం సొంతం చేసుకుంది.
Mahesh Babu Latest Movies
ఇక ఇటీవల ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ బరిలో గుంటూరు కారం (Guntur Kaaram) మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చారు మహేష్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించిన ఈమూవీ పై ఎక్కడా ఎన్నడూ ఎవ్వరూ కక్కంత విషాన్ని యాంటీస్ సోషల్ మీడియాలో కక్కడం జరిగింది. ముఖ్యంగా అనేక రివ్యూస్, రేటింగ్స్ లో సైతం గుంటూరు కారం పెద్ద డిజాస్టర్ అని ప్రచారం అయింది.
అయినప్పటికీ కూడా కోట్లాది హృదయాల్లో సూపర్ స్టార్ గా గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు, గుంటూరు కారం మూవీలో రమణగాడిగా మరొక్కసారి తన సహజ నటనతో ఆడియన్స్, ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. కంటెంట్ పరంగా గుంటూరు కారం పర్వాలేదనిపించినప్పటికీ మహేష్ బాబు మార్వలెస్ పెర్ఫార్మన్స్ దానికి పెద్ద ప్లస్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కురిపించింది. అవతల హను మాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఉన్నప్పటికీ కూడా డిజాస్టర్ టాక్ తో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఈ మూవీ అనంతరం టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన తదుపరి SSMB29 గ్లోబ్ స్ర్టింగ్ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి శ్రీకారం చుట్టారు మహేష్ బాబు. తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు పోషించని ఒక అద్భుతమైన పాత్రని మహేష్ బాబు ఈ మూవీలో పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక తన పాత్ర కోసం ఇప్పటికే పూర్తిగా బల్క్ గా బాడీని పెంచడంతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
Mahesh Babu Latest Movies
ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ తన సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈమూవీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా సాగనుండగా దీనిని సౌత్ ఆఫ్రీకాల్ అడవుల నేపథ్యంలో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించనున్నారట. అలానే ఈమూవీ భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా దాదాపుగా రూ. 1000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మితం కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. అలానే ఈ భారీ ప్రతిష్ట్మాక మూవీలో పలువురు హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గతంలో తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ ఆడియన్స్ యొక్క క్రేజ్ అందుకున్న జక్కన్న, ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ ద్వారా ఆస్కార్ అవార్డుని మన భారతదేశానికి తీసుకువచ్చి అందరి మన్ననలు అందుకున్నారు.
దానితో SSMB29 మూవీ పై అందరి అంచనాలు ఆకాశమంతటి ఎత్తుకి చేరాయి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో పట్టాలెక్కనుండగా రిలీజ్ మాత్రం 2027 లో ఉండే అవకాశం ఉందని టాక్. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ హాలీవుడ్ రేంజ్ కి పెరగడం ఖాయం.
Mahesh Babu Latest Movies
అయితే ఈ మూవీ తరువాత ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన కెరీర్ 30వ మూవీని సూపర్ స్టార్ మహేష్ చేయనున్నారనే టాక్ కూడా టాలీవుడ్ లో నడుస్తోంది. ఆపైన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ వంటి దర్శకులతో కూడా ఆయన వర్క్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాజమౌళి తో మూవీ అనంతరం హీరోగా వరల్డ్ వైడ్ గా మార్కెట్ అందుకోనున్న సూపర్ స్టార్, అక్కడి నుండి మరింత జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకోనున్నారట. మరి కెరీర్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.