సమంతా సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి డైనమిక్ ఎంట్రీ ఇచ్చి ఊహించని విషయాలు షేర్ చేసారు..

అతి తక్కువ సమయం లోనే విశేష ప్రశార్ధన పొందిన ఆహా ఓటీటీ వేదిక వినుతిరమయిన కార్యక్రమాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే “సామ్ జామ్” పేరిట ఒక్క టాక్ షో ని ప్రారంభించింది ఈ టాక్ షో కి అందాల భామ సమంత హోస్ట్ గా వ్యహస్తరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులని ఇంటర్వ్యూ చేయబోతుంది. తాజా గా సామ్ జామ్ షో లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయన అన్నపూర్ణ స్టూడియో కి రాగా కెమెరాలు అని క్లిక్ మన్నాయి.

సరి కొత్త లుక్ తో చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం మనం ఫొటోస్ ద్వారా చూడచ్చు. బ్లేజర్ ఇంకా డెనిమ్ పాంట్స్ లో స్లిమ్ గా ఉన్న చిరంజీవి వయసు తక్కువ అయ్యిందా అన్నట్లు అనిపిస్తున్నారు.సామ్ జామ్ వేదికపాయి తళుక్ మన్నారు చిరు ఫేస్ మాస్క్ ధరించి మరియు అతని దుస్తులు చాలా ఫార్మల్ లుక్ లో కనిపించరు.

ఇటీవలే కోవిడ్ పాజిటివ్ అని చిరు చేసిన ట్వీట్ కి చిత్ర పరిశ్రమ షాక్ అయ్యారు,అయితే మరో రెండు రోజులోనే మరో ట్విట్ చేసారు మరో సారి మూడు రకాల కోవిడ్ పరీక్షలు చేపించారని నెగటివ్ రావడం తో మెగా ఫాన్స్ మరియు సినీ ఇండస్ట్రీ లో ఆనందపడ్డారు. ఆచార్య షూటింగ్ ని ఈ నెల 9వ తేదీన మొదలు పెడతారు అని ప్రకటించారు అయితే చిరు కి కోవిడ్ పాజిటివ్ అని తెలిసాక చిరు లేకుండ స్టార్ట్ చేసారు.

చిరంజీవి మరి కొద్దీ రోజులో షూటింగ్ లో పలుగొంటున్నారు,హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని మాల్దీవ్స్ లో హనీమూన్ ట్రిప్ లో ఉంది తను కూడా డిసెంబర్ మొదటి వారం లో ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాబోతుంది వీలు అయినంత త్వరగా ఆచార్య ని పూర్తీ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శకుడు కొరిటాల శివ కోరిక. రామ్ చరణ్ కీలకపాత్ర పోషించే ఈ సినిమా మెగాస్టార్ ఇమేజ్ ను మరో మెట్టు పెంచుతుందని భావిస్తున్నారు.

ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలను సమంత తో ఈ ఇంటర్వ్యూ లో చిరు షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఏ కాకుండా రష్మిక మందాన, తామన్నహ్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఈ షో లో రాబోతున్నారు. ఈ షో ద్వారా సమంత మంచి అభినేత్రి తో పాటు మంచి హోస్ట్ గా కూడా వ్యవహరించగలదు అని నిరూపించుకుంది.