మెగాస్టార్ చిరంజీవి గుండు వెనుక అసలు స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రభనజనమే కనిపిస్తుంది.దానికి ముఖ్య కారణం నిన్న ఆయన ఎప్పుడు కనిపించని సరికొత్త లుక్ తో కనిపించడమే.సుమారు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇంతముందు ఎప్పుడు కూడా గుండు అవతారం లో కనిపించలేదు.మొట్టమొదటి సారి మెగాస్టార్ తన తదుపరి సినిమా కోసం గుండు అవతారం లో దర్శనం ఇవ్వబోతున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే .ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ దర్శకత్వం లో నటించబోతున్నాడు.ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలమ్ సినిమాకి రీమేక్ గా రానుంది

వేదలమ్ సినిమా అజిత్ కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అప్పట్లో తమిళ నాట వరదలు వచ్చిన కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వరదని కురిపించింది.ఈ సినిమాలో అజిత్ రెండు విభిన్నమైన గెట్ అప్స్ లో మనకి కనిపిస్తాడు .అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గుండు అవతారం ఒక్కటి.ఈ గెట్ అప్ తమిళనాట సంచలనం గా మారింది, ఇప్పుడు అదే గెట్ అప్ ని మెగాస్టార్ చిరంజీవి కూడా వేయనున్నారు.దీనికి సంబంధించిన టెస్ట్ లుక్ కి భాగంగానే నిన్న గుండు మేకప్ తో ట్రైల్స్ వేశారు.అది సోషల్ మీడియా లో ప్రభంజనం గా మారింది.ఇదండీ మెగాస్టార్ చిరంజీవి గుండు స్టోరీ