బాలు గారి వార్త విని ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్!

గత కొద్దీ రోజులు గా గాన గంధర్వుడు SP బాల సుబ్రమణ్యం గారు కోవిడ్ బారిన పది హాస్పిటల్ లో చికిత్స తీసుకోడం మన అందరికి తెలిసిందే.అయితే గురువారం రాత్రి నుండి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడ్డ ఆయన, శుక్రవారం మధ్యాహ్నం వెంటిటలేటర్ల పైనే అయన తుది శ్వాస విడిచారు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు అనుకున్న అభిమానులను శోకసంద్రం లో ముంచేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.Sp బాలు గారు ఈ రోజు మధ్యాహ్నం 1:04 నిమిషాలకు మరణించినట్లు అయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయం గా ధ్రువీకరించారు.

చెన్నై లో ని మౌంట్ రోడ్ సత్యం థియేటర్ వద్దకు బాలు గారి భౌతిక కాయం తరలించే అవకాశంవుంది. ఆగష్టు 5 న కరోనా పాజిటివ్ అని తెలియగానే చెన్నై లోని ఎం .జి .ఏ హాస్పిటల్ లో చేరారు. యాబై రోజులుగా వెంటిలేటర్ల పైనే చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించారు. బాలు గారి మరణ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులను శోకం లో ముంచేసింది. ఈ వార్త వినగానే పలువురు సినీ స్టార్స్ మరియు రాజకీయ నేతలు తమ సానుభూతిని తెలియచేస్తూ, బాలు గారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

యస్.పి బాల సుబ్రహ్మణ్యం గారి మరణ వార్త వినగానే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారిని తలచుకుంటూ మీడియాతో మాట్లాడారు.`బాలు గారు కోవిడ్ బారిన పది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని తెలియగానే వారు త్వరగా కోలుకోవాలి మల్లి మనముందుకురావాలి అని కోరుకుంటూంన్నేను , నాతోపాటు దేశమంతా అయన మల్లిక్షేమంగా తిరిగిరావాలి అనే ఆకాంక్ష తో ఎదురుచూసారు. బానే వుంది!అనుకునే సమయం లో ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది.దురదృష్టవశాత్తు ఆయనకి ఇలా జరగడం చాలభాధ గా వుంది.చిన్నప్పటినుండి ఆయన్ని చూస్తున్న వాడ్ని ఎనలేని గౌరవం ఆయనంటే నాకు.ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఇలా జరగడం చాలా భాధ గా వుంది అంటూ , అయన కుటుంబ సభ్యులందరికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.