Pawan Kalyan Latest News టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. ఇటీవల జనసేన పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తరపున పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్యెల్యే గా గెలుపొందిన పవన్, ప్రస్తుతం ఆంధ్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా ఆయన తన రాజకీయ కార్యక్రమాలతో ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి సుజీత్ తీస్తున్న ఓజి, క్రిష్ మరియు జ్యోతి కృష్ణ తీస్తున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ మూడు మూవీస్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా సూపర్ గా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ మూడు మూవీస్ కి సంబంధించి కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా వీటిలో హరిహర వీరమల్లు, ఓజి షూటింగ్స్ యొక్క మిగతా బ్యాలెన్స్ ని పూర్తి చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు పవన్.
ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూ మరోవైపు సినిమాల షూట్ ని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్నారు పవన్. ఇక ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో ముందుగా ఓజి గురించి మాట్లాడుకుంటే, పవన్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్ తీస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతోంది. తొలిసారిగా యువ నటుడు శర్వానంద్ తో రన్ రాజా రన్ మూవీ తెరకెక్కించి మంచి విజయం అందుకున్న సుజీత్, ఆపై ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సాహో మూవీ తీసే అవకాశం అందుకున్నారు.
Pawan Kalyan Latest News
బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుంది. ముఖ్యంగా సాహోలో స్టైలిష్ యాక్షన్ అంశాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ విధంగా సుజీత్ తన టాలెంట్ తో ఆడియన్స్ ని అలరించారు. ఇక ప్రస్తుతం ఓజి లో పవన్ కళ్యాణ్ ని కూడా ఎంతో పవర్ఫుల్ గా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈమూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది.
కోలీవుడ్ అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారట.
Pawan Kalyan Latest News
ఇక తదుపరి పవన్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ రెండు పార్ట్స్ గా రూపొందుతోందగా ఫస్ట్ పార్ట్ స్వార్డ్ vs స్పిరిట్ యొక్క కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మిగతా భాగాన్ని యువ దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సీనియర్ నిర్మాత ఏఎం రత్నం తన మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తున్న హరిహర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే హరిహర వీరమల్లు నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ ఒకదానిని మించేలా మరొకటి ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి . కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని 2025 సమ్మర్ కానుకగా మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఓజి, హరిహర వీరమల్లు మూవీ బ్యాలెన్స్ షూట్స్ వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ రెండు మూవీస్ తో పాటు పవన్ కళ్యాణ్ చేస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తీస్తుండగా ఇందులో యువ అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇటీవల తమిళ్ లో ఇలయదళపతి విజయ్ హీరోగా అట్లీ తీసిన సూపర్ హిట్ మూవీ తేరికి ఇది రీమేక్ అని టాక్. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క మిగతా బ్యాలెన్స్ షూట్ ని త్వరలో ప్రారంభించనున్నారు.
Pawan Kalyan Latest News
ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై గ్రాండ్ లెవెల్లో దీనిని వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ లు అందరినీ ఆకట్టుకున్నాయి.
చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత తనకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ తో చేస్తుండడంతో ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ పై దర్శకుడు హరీష్ శంకర్ మరింతగా కెర్ తీసుకుంటున్నారు. ఇందులో పవన్, ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ విధంగా మూడు మూవీస్ తో కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న పవన్, ఇవి పూర్తి అయి రిలీజ్ అనంతరమే తదుపరి చేయనున్న సినిమాలని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan Latest News
ముఖ్యంగా ఈ మూడు మూవీస్ కూడా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఇవి రిలీజ్ అనంతరం మంచి విజయాలు సొంతం చేసుకుంటే హీరోగా పవన్ మరింత ఉన్నత స్థాయికి చేరడంతో పాటు ఆయన మార్కెట్ కూడా బాగా పెరగడం ఖాయం. కాగా కెరీర్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూడు మూవీస్ తో విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.