విడుదలకు నోచుకోని పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ ఇదే

టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలు చేసి అసాధారణమైన సీజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా ఉంటె టక్కుమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనకి గుర్తు వస్తాడు, చేసింది కేవలం 23 సినిమాలే అయినా (రెండు సినిమాల్లో అతిధి పాత్రలను మినహాయించి) తనకంటూ ఒక్క ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరుచుకొని తన సొంత కష్టం తో యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫోల్వయింగ్ ని ఏర్పరచుకున్నాడు పవన్ కళ్యాణ్, ఈయన కెరీర్ తొలినాళ్లలో చేసి సుస్వాగతం , తొలిప్రేమ, తమ్ముడు , బద్రి మరియు ఖుషి వంటి సినిమాలు అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఆయన అప్పట్లో అలాంటి సినిమాలు తీసాడు కాబట్టే ఈరోజు ఆయన ఎంత చెత్త సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే రేంజ్ కి ఎదిగాడు, అయితే కెరీర్ లో పవన్ కళ్యాణ్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్రారంభించి కొంత భాగం షూటింగ్ ని చేసుకొని కూడా వదులుకోవాల్సి వచ్చింది,ఒక్కసారి షూటింగ్ ప్రారంభం అయ్యి మధ్యలోనే ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

2000 సంవత్సరం లో విడుదల అయినా నువ్వే కావాలి సినిమా అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా ద్వారా తరుణ్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు,అప్పట్లో ఈ సినిమాని తొలుత చెప్పాలని ఉంది అనే పేరు తో పవన్ కళ్యాణ్ మరియు అమీషా పటేల్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కాల్సింది, ఈ సినిమాని శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఏం రత్నం ఘనం గా ప్రారంబించాడు, ఒక్క 20 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది, కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా మధ్యలోనే అర్ధంతరం గా ఆగిపోయింది, ఆ తర్వాత రప్రముఖ నిర్మాత రామోజీ రావు ఈ సినిమా స్టోరీ ని ఏ ఏం రత్నం దగ్గర కొనుగోలు చేసి తరుణ్ మరియు రిచా లను హీరోహీరోయిన్లు గా పెట్టి ఉష కిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించాడు,అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంట, అప్పటి వరుకు ఉన్న ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ అన్నిటిని దాటి నెంబర్ 1 గా నిలిచింది ఈ చిత్రం, నూతన నటీనటులతో తీస్తేనే ఇంత పెద్ద హిట్ అయ్యింది అంటే, ఇక పవన్ కళ్యాణ్ లాంటి యూత్ ఐకాన్ ఈ సినిమాని చేసి ఉంటె ఎలాంటి విజయం సాధించి ఉండేదో ఊహించుకోవచ్చు.

ఇక జానీ సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా చేదు అనుభవం మిగిలించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఖుషి సినిమా తో ఇండస్ట్రీ ని షాక్ చేసిన తర్వాత తెరకెక్కిన సినిమా కావడం తో అప్పట్లో ఈ సినిమా పై అంచనాలు కనివిని ఎరుగని రీతిలో ఉండేవి, కానీ ఆ అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యింది ఈ సినిమా, కానీ దర్శకుడిగా మొదటి ప్రయత్నం విఫలం అయినా కూడా పట్టు వదలని పవన్ కళ్యాణ్ రెండో సారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యాగ్రహి అనే సినిమాని ప్రారంబించాడు, ఈ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్ గారు,అట్టహాసంగా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంబించుకున్న ఈ సినిమా కూడా విడుదల కి నోచుకోలేకపోయింది, షూటింగ్ ప్రారంభం అయినా అతి కొద్దీ రోజులకే ఈ సినిమా కూడా ఆగిపోయింది.

ఇక క్రియేటివ్ జీనియస్ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో పవన్ కళ్యాణ్ జీసస్ క్రిస్ట్ పాత్ర నటించాల్సి ఉంది, చాలా వరుకు షూటింగ్ ని జేరుసిలుమ్ లో కూడా షూట్ చేసారు, కానీ ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ ఈ సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది, ఇలా పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రారంబించి మధ్యలోనే ఆగిపోయిన మూడవ సినిమా ఇది, ఇక పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్ట్ వేస్తె ఈ ఒక్క ఆర్టికల్ సరిపోదు, ఇండస్ట్రీ ని ఒక్క ఊపు ఊపేసిన ఎన్నో సినిమాలను ఆయన చేతులారా వదిలేసుకున్నాడు, ఇడియట్ ,పోకిరి ,అతడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గోలీమార్ , మిరపకాయ్ బాబోయ్ ఇలా ఒక్కట్ల రెండా చెతులారా ఎన్నో అద్భుతమైన సినిమాలని వదిలేసుకుని తమిళ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేస్తూ ఫెయిల్యూర్స్ ని అందుకున్నాడు.