భీమవరం ఎమ్మెల్యే కి పగిలిపొయ్యే రేంజ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత తొందరగా రోజు రోజుకి మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు మార్పుకి కేంద్ర బిందువుగా మారింది,ముఖ్యం గా సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాయన్ జనసేన పార్టీ పంచాయితీ ఎన్నికలలో మాత్రం అద్భుతమైన విజయాలు సాధించి తన ఉనికిని చాటుకోగా, 5 సార్లు అధికారం లో ఉన్న పార్టీ, బలమైన క్యాడర్ మరియు ఓటు బ్యాంకు ఉన్న తెలుగు దేశం పార్టీ కి ఈ ఎన్నికలు చావు దెబ్బ కొట్టింది అనే చెప్పాలి, ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజక వర్గం అయినా కుప్పం లో కూడా టీడీపీ కి దారుణమైన ఫలితాలు అవచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు, తెలుగు దేశం పార్టీ ఏ స్టాయిల్కి పడిపోయిందో,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎదుగుదల అటు వైసీపీ పార్టీ పై ఇటు తెలుగుదేశం పార్టీ పడినట్టు స్పష్టంగా ఈ ఎన్నికల ద్వారా అర్థం అవుతుంది,కొన్ని స్థానాల్లో అయితే తెలుగు దేశం పార్టీ కి మాత్రమే కాదు, అధికార వైసీపీ పార్టీ కి కూడా ముచ్చమటలు పట్టించింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీవమారం నియోజకవర్గం లో అక్కడి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్ని ప్రాంతాలలో ఏకగ్రీవం చెయ్యడానికి తీవ్రంగా ప్రయత్నం చేసాడు.

అధికార బలం తో గ్రంధి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గం లో దాదాపు అన్ని పంచాయితీలను ఏకగ్రీవం చేయగలిగాడు కానీ వీరవాసరం మండలం, మత్సపురి గ్రామా పంచాయితీ లో మాత్రం ఇక గ్రీవం చెయ్యలేకపోయాడు, అక్కడ ఎన్నికలలో పోటీ ని నిర్వహించి జనసేన పార్టీరీ కి ఓట్లు గుద్ది గెలిపించుకున్నారు అక్కడి జనాలు, అయితే జనసేన పార్టీ శ్రేణులు చేసే విజయోత్సవ రాలిలు మరియు సంబరాలు చూసి తట్టుకోలేకపోయిన గ్రంధి శ్రీనివాస్ మొన్న రాత్రి తన సమూహం తో జనసేన పార్టీ వార్డు మెంబెర్స్ ని మరియు జనసేన పార్టీ కి ఓట్లు వేసిన వారి ఇళ్ల మీద దాడులు చేయించాడు, ఈ సంఘటన ఇప్పుడు ఒక్క సంచలనం గా మారింది, సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ, పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రంధి శ్రీనివాస్ కి నెగటివ్ గా పోస్టుల మీద పోస్టులు పెడుతూ తమ కోపాన్ని తీర్చుకుంటున్నారు, అయితే గ్రంధి శ్రీనివాస్ జరిపిన ఈ దాడుల పై మరియు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర స్థాయిలోనే తిప్పి కొట్టాడు, ఆయన ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాము.

ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో జనసేన పార్టీ విజయాలను అధికార వైసీపీ పార్టీ తట్టుకోలేక పోతుంది,కొన్ని చోట్ల జనసేన పార్టీ తరుపున గెలిచినా కొంతమంది సర్పంచులను మరియు వార్డ్ మెంబెర్స్ పై వైసీపీ పార్టీ దాడులు జరిపించడం చాలా బాధ కలిగించే విషయం, నిన్న భీమవరం నియోజకవర్గం లో మత్స్యపురి పంచాయితీ లో జనసేన పార్టీ కార్యకర్తల ఇంటి పై దాడులు చేయించడం చాలా బాధ కలిగించే విషయం, ఆ నియోజక వర్గ ఎమ్యెల్యే ఒక్క ఆకు రౌడీ, బ్యాంకులను నిర్దాక్షణంగా దోచుకున్న వ్యక్తి అతను, మీకు నిజంగానే అంత బలం ఉంటె ఎందుకు జనసేన పార్టీ ని చూసి అంత భయపడుతున్నారు,నేను దీనిని అంత తేలికగా వదలను, మార్చి మొదటి వారం లో భీమవరం కి వస్తున్నా, ఎదో తేల్చుకుందాం అన్నావుగా, కచ్చితంగా తేల్చేసుకుందాం వచ్చేయి, జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా నేను చెప్పుకొచ్చేది ఒక్కటే, నా మీద వాళ్ళు చేసే అనుచిత వ్యాఖ్యలు మిమల్ని బాధించవచ్చు,దయచేసి ఓర్పుని వహించండి, ఒక్క మనిషి నడిచి వెళ్తుంటే కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి, పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం కూడా వాటిని కరిచేయలేం కదా, మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి కుక్కల వ్యాను లో తోసేస్తాం, ఇది కూడా అంతే, రాజ్యాంగ బద్దంగానే మనం పోదాము’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.