పవన్ కళ్యాణ్ రవితేజ ముల్టీస్టార్ర్ర్ కి ముహూర్తం సిద్ధం

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ మరియు రవితేజ కి ఎలాంటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక్కరికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ,మరొక్కరికి మాస్ లో తిరుగులేని ఇమేజ్ ఉంది, వీళ్లిద్దరు ఇన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కూడా ఒక్కసారి కూడా కలిసి నటించలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మరియు రవితేజ కి యాక్టింగ్ నుండి ఎనర్జీ వరుకు సెంటిమెంట్ నుండి కామెడీ వరుకు ప్రతి ఒక్క యాంగిల్ లో ఇద్దరికీ చాల పోలికలు ఉన్నాయి.ముఖ్యంగా కామెడీ టైమింగ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతము వీళ్ళిద్దరిని కొట్టే హీరోనే లేవు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, అలాంటి వీళ్లిద్దరు కలిసి త్వరలోనే ఒక్క సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మరియు రవితేజ కలిసి ఒక్క పాపులర్ మలయాళం సినిమా రీమేక్ లో నటించబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల మరియు కాటంరాయుడు సినిమాలు చేసిన డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ సినిమాని రామ్ తల్లూరి నిర్మించబోతున్నారు, ఈయన గతం లో రవితేజ తో నెల టిక్కెట్టు మరియు డిస్కో రాజా సినిమాలు తీసాడు, రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైయ్యాయి. ఈసారి మంచి సబ్జెక్టు తో పవన్ కళ్యాణ్ మరియు రవితేజ ముల్టీస్టార్ర్ర్ సినిమా తీసి భారీ హిట్ కొట్టాలి అనే కసి తో ఉన్నాడు, మరి రామ్ తల్లూరి అదృష్టం ఎలా ఉందొ చూద్దాం.