పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ తో ఎన్ని కోట్లు వసూల్ చేసారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉంది ఇపుడు మల్లి 3 ఏళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమా తో మన ముందుకి రాబోతున్నారు.. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి అభిమానుల్లో ఎంతో ఆనందం ఉత్సాహం కనిపిస్తుంది.. బాలీవుడ్ లో పింక్ రీమేక్ గా తెలుగు లో వకీల్ సాబ్ వస్తుంది.. హిందీ లో నటుడు అమితాబ్ బచ్చన్ నటించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తరువాత ఈ సినిమాని తమిళ్ లో అజిత్ తీశారు అక్కడ కూడా సెన్సషనల్ హిట్ అయింది.. ఇపుడు తెలుగు లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు అంటే అభిమానుల్లో ఆనందం చెప్పకర్లేదు ఫాన్స్ పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అలాంటి అద్భుతమైన టీమ్ తో మన ముందుకి వస్తుంది.

ఈ కరోనా వేల చిత్ర షూటింగ్ కి సంబంధించి 9 నెలలు విరామం వచ్చింది లేకపోతే సంక్రాతి సమయం కంటే ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ వేసింది మూవీ యూనిట్ ఇక తాజాగా వచ్చిన సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సర్ప్రైజ్ చేసింది.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ని ఎంతో అద్భుతంగా చూపించారు గతం లో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంత బాగా చుపించారో ఇపుడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ ని లాయర్ గా అంతే అద్భుతంగా చూపిస్తున్నారు.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ గారంటీ అంటూ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

వకీల్ సాబ్ టీజర్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించింది.. ఫిలిం నగర్ లో ఈ టీజర్ కి మంచి టాక్ వచ్చింది, ఇంకా మాస్, క్లాస్ ఆడియన్స్ అందరికి కూడా టీజర్ ని చూసి శబాష్ అనిపించారు.. ఇంకా పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ద్వారా గబ్బర్ సింగ్ కి మించిన హిట్ ఇవ్వడం పక్క అని టాక్ నడుస్తుంది.. ఈ సినిమా హిందీ లో కానీ తమిళ్ లో సినిమాలో హీరో పాత్ర స్క్రీన్ పై చాలా తక్కువ సమయం ఉంటుంది ముఖ్యం గా ముగ్గురు అమ్మాయిల చుట్టూ నే సినిమా మొత్తం తిరుగుతుంది..తెలుగు లో కూడా ఇది పూర్తీస్థాయి పవన్ కళ్యాణ్ సినిమా కాదని ట్రయిల్ వర్గాల్లో అంచనాలు ఉండేవి దానికి తగ్గట్టుగానే బిసినెస్ కూడా రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా బిసినెస్ కంటే తక్కువ చేసే ట్రేండింగ్ లో ఉంది..

టీజర్ విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ స్టైల్ లో సినిమా మొత్తని మార్చేశారు ఇది పూర్తిగా అర్ధం అయింది.. ఈ సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి కొనాలని ముందుకు వస్తున్నారు .. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రైట్స్ 120 కోట్ల రూపాయలు పలుకుతున్నాయి, ఇక టాలీవుడ్ లోని కమర్షియల్ మూవీ కి ఈ స్థాయి రేట్ రావడం ఒక రికార్డు అనే చెప్పాలి.. ఈ సినిమా డిజిటల్ సాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ 15 కోట్లు రూపాయలు కొనుగోలు చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అన్ని కేవలం టీజర్ వల్ల పెరిగిన బిసినెస్ అని పండితులు చెప్తున్నారు.. ఒక టీజర్ తో కోట్ల రూపాయల బిసినెస్ జరుగుతుంది అంతే అది పవన్ కళ్యాణ్ సత్తా అని అంటున్నారు.. వకీల్ సాబ్ సినిమా గురించి ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.. సరికొత్త రికార్డు లు సృష్టించడానికి వకీల్ సాబ్ వేసవి లో మన ముందుకి రానున్నారు అని ఫాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు.