పోకిరి సినిమాలో హీరో ఛాన్స్ ని మిస్ చేసుకున్న ప్రముఖ విలన్ ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోయ్యే సినిమాలు ఎన్నో ఉన్నాయి.వాటిల్లో పోకిరి అనే సినిమా ఒక్కటి.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.అప్పటి వరుకు కేవలం ఒక్క స్టార్ హీరో గా మాత్రమే ఉన్న మహేష్ బాబు ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ గా ఎదిగాడు.ఇక ఆ సినిమా తర్వాత ఈరోజు మహేష్ బాబు ఎలాంటి స్థానం లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

.ఈ సినిమా ని ఏ భాషలో రీమేక్ చేసిన ఆ భాషలో సంచలన విజయం సాధించి ఆ సినిమా నటించిన హీరోలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని పొయ్యింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ని తొలుత పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చెయ్యాలి అనుకున్నాడు.పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా న్యారేట్ చేసాడు అట.కానీ ఎందుకో ఆయన ఈ సినిమాని ఒప్పుకోలేదు అని పూరి జగన్నాథ్ అనేక ఇంటర్వ్యూలలో తెలిపాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది

ప్రస్తుతం సోషల్ మీడియా లో మరియు టీవీ ఛానల్ లో మోస్ట్ ట్రెండ్ అవుతున్న ప్రముఖ నటుడు సోను సూద్.కోవిద్ సమయం లో ఇతనికి చేసిన సహాయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పూరి జగన్త్ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు సినిమాలకు పరిచయం అయినా సోను సూద్ ఆ తర్వాత అదే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో పోకిరి సినిమాలో నటించాల్సి ఉంది.కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు.ఆ తర్వాత సోను సూద్ అరుంధతి సినిమా లో విలన్ గా మ్నట విశ్వరూపం చూపించడం తో ఇక ఆ సినిమా తర్వాత ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారి అందరి హీరోల సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత సోను సూద్ బాలీవుడ్ లో కూడా ప్రముఖ హీరోలందరి తో కలిసి నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఒక్కవేల సోను సూద్ పోకిటి సినిమాలో హీరో గా చేసి ఉంటే ఈరోజు టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒక్కరిగా ఉండేవారు ఏమో!