ప్రభాస్ సినిమాకి దీపికా పదుకొనె ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా మహానటి ఫేమ్ నాగ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీ బ్యానర్ పై ఒక్క సినిమా రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకి సంబంధించి స్టార్ కాస్ట్ విషయం లో కూడా దర్శక నిర్మాతలు ఎక్కడ తగ్గట్లేదు.ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె ని ఒప్పించి నటింపచేయబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇందుకోసం ఆమెకి నిర్మాత సి.అశ్వినీదత్ 30 కోట్ల రూపాయిల భారీ పారితోషికం ని అందచెయ్యబోతున్నారు అట.ఇది ఇండియన్ ఫిలిమ్ హిస్టరీ లోనే ఒక్క రికార్డు అని చెప్పొచ్చు.ఇప్పటికి వరుకు ఒక్క హీరోయిన్ కి ఈ స్థాయి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి.ఎందుకంటే దీపికా పదుకొనె కి బాలీవుడ్ లో ఖాన్స్ సమానమైన క్రేజ్ ఉంది.

ఈమె సినిమాకి బాలీవుడ్ జనాలు క్యూ కడతారు ,అందుకే బీదర్సక నిర్మాతలు ఆమె కోరిన పారితోషికం ని ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించలేదు అట.ప్రభాస్ కి ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ,ఈయన ప్లాప్ సాహూ సినిమా అక్కడి ఖాన్స్ సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసింది అంటే చెప్పొచ్చు ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ చెప్పడానికి.అలాంటి ప్రభాస్ దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్ తో మూవీ చేస్తే బాలీవుడ్ లో ఇక నాన్ బాహుబలి రికార్డు కి బదులుగా నం ప్రభాస్ రికార్డు కేటగిరి పెట్టేయొచ్చు అని బాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం లో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా తరువాత ఆయన ఈ క్రేజీ ప్రాజెక్టు ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు.దీనితో పాటు ఆయన బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రాత్ తెయ్యబోతున్న రామాయణ గాఢ ‘ఆది పురుష్’ సినిమాలో రాముడిగా నటించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా ,రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇక సీత పాత్ర లో ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.