జగన్ ప్రస్తావన చూసి కర్ణాటక ముఖ్యమంత్రి షాక్ అయ్యాడు!

తిరుమలలో శ్రీవారి సేవలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర *ముఖ్యమంత్రులు

తేది:24-9-2020,తిరుమల
గురువారం ఉదయం 6:30 గంటలకు శ్రీవారిని దర్శించు కునేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు , టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి స్వాగతం పలుకగా..శ్రీ వారి దర్శనార్థం విచ్చేసిన గౌ.కర్ణాటక ముఖ్య మంత్రి శ్రీ యడ్యూరప్ప గారి కు స్వాగతం పలికిన టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మహా ద్వారం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి కలిసి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు కె. నారాయణ స్వామి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, మం త్రులు పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి,తిరుపతి,సత్యవేడు,శ్రీకాళహస్తి శాసన సభ్యు లు భూమన కరుణాకర్ రెడ్డి, ఆదిమూలం,బియ్యపు మధుసూదన రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ డి. మార్కండేయులు,జిల్లా ఎస్.పి రమేష్ రెడ్డి అధి కారులు కలరు.
శ్రీ వారి దర్శనానంతరం నాదనీరాజనం మండపం వద్ద సుందరకాండ పారాయణం నకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు…