Pushpa 2 Trailer in Telugu – Official Video, Release Date & Latest Updates

Pushpa 2 Trailer in Telugu టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమవుతున్న పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై మన తెలుగు

Pushpa 2 Trailer in Telugu – Official Video, Release Date & Latest Updates
టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమవుతున్న పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈమూవీ భారీ క్రేజ్ కలిగి ఉంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే టైం కి ఆడియన్స్ ముందుకి వచ్చిన పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ పుష్ప 1 ది రైజ్ అప్పట్లో మంచి విజయం అందుకున్న విషయం తెల్సిందే.  

Pushpa 2 Trailer in Telugu – Official Release & Updates

ఈ మూవీ తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. అంతకముందు అలవైకుంఠపురములో వంటి భారీ బ్లాక్ బస్టర్ తో అందరినీ అలరించి ఆ మూవీలోని సాంగ్స్ తో నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించారు అల్లు అర్జున్. ఇక పుష్ప 1 మూవీ ఓవరాల్ గా అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రూ. 385 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, రావురమేష్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, అజయ్ నటించారు.

Pushpa 2 Trailer Release Date & Time in India

ఇక ఈ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మార్వలెస్ యాక్టింగ్ కి అందరి నుండి విశేషంగా ప్రసంశలు కురవడంతో పాటు ఆయన కు భారత ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. దానితో పుష్ప 2 ది రూల్ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పుష్ప 2 నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ తో పాటు రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. ఇక పుష్ప 2 మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత గ్రాండియర్ గా భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.

Where to Watch Pushpa 2 Trailer in HD?

Pushpa 2 Trailer Review Telugu

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీ యొక్క సాంగ్స్ తో పాటు బీజీఎమ్ విషయంలో కూడా మరింత శ్రద్ధ తీసుకుంటున్నారట. అలానే దేవిశ్రీ తో పాటు థమన్, మరొక సంగీత దర్శకుడు దీనికి బీజీఎమ్ అందించనున్నారు. ప్రస్తుతం ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం జరుపుకున్న పుష్ప 2 మూవీ నుండి త్వరలో మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ నుండి అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ యొక్క నిడివి 2 నిమిషాల 44 సెకండ్స్. ముఖ్యంగా పుష్ప 2 ట్రైలర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్వలెస్ పెర్ఫార్మన్స్ తో పాటు భారీ యక్షన్, ఫైట్స్ వంటివి ఎంతో బాగున్నాయి.

అలానే విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో అల్లు అర్జున్ స్వాగ్, స్టైల్ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఎంతో పవర్ఫుల్ గా యాక్షన్ అంశాలతో ఆకట్టుకున్న పుష్ప 2 ది రూల్ ట్రైలర్, మూవీ పై అంచనాలు అమాంతం మరింతగా పెంచింది. అయితే పుష్ప 2 ట్రైలర్ ని బీహార్ లోని పాట్నా లో గల గాంధీ మైదాన్ లో నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్ కి తరలివచ్చి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసారు.

ఇక ఈ మూవీని డిసెంబర్ 5న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా పుష్ప 2 మూవీ రూ. 1000 కోట్లకు పైగా జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 ని అత్యధిక థియేటర్స్ లో ప్రదర్శించేందుకు మూవీ యొక్క డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ మేర ఒప్పందం కూడా కుదిరింది.

Pushpa 2 Trailer Review – Fans Reactions & Expectations

Pushpa 2 Trailer Official

అయితే అన్ని ఏరియాల్లో అందరిలో భారీ స్థాయిలో పుష్ప 2 మూవీ పై హైప్ ఉండడంతో మూవీ యొక్క కంటెంట్ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే డే 1 ఓపెనింగ్స్ మొదలుకుని క్లోజింగ్ వరకు మూవీకి ఎవరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా తమ హీరో నటిస్తున్న ఈ మూవీ భారీ స్థాయిలో సక్సెస్ సాధించి నటుడిగా ఆయన క్రేజ్, ఇమేజ్ తో పాటు మార్కెట్ వేల్యూ ని కూడా అమాంతం పెంచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 2 Trailer Songs, BGM & Technical Details

ఇక మరోవైపు పుష్ప 2 మూవీకి సంబంధించి దేశంలోని మొత్తంగా ఏడు ఎంపిక చేయబడ్డ ప్రధాన నగరాల్లో భారీ స్థాయి ఈవెంట్స్ ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో జరుగగా, మిగతా ఆరు ఈవెంట్స్ యొక్క ప్లానింగ్స్ కూడా మొదలయ్యాయట. ఇక పుష్ప 1 మూవీ స్పెషల్ ఐటెం సాంగ్ ని అందాల నటి సమంత చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ని యువ అందాల నటి శ్రీలీల చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై మూవీ టీం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మరి ఈ విధంగా అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ఆడియన్సు ని ఆకట్టుకుంటుందో, ఏస్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Pushpa 2 Trailer Reaction

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow