రామ్ చరణ్ ఉపాసన చేస్తున్నా డాన్స్ ప్రోగ్రాం గూర్చి తెలిస్తే సెల్యూట్ చేస్తారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన గారు , గ్రామలకే పరిమితమైన టాలెంట్ ను ప్రపంచమంతా తెలియజేయాలని శ్రీకారం చుట్టారు. వైద్య రంగానికి చెందిన కుటుంబం లో పుట్టటం వల్లనేమో ఉపాసనకు లైఫ్ స్టైల్ , న్యూట్రిషన్ , ఫిట్నెస్ లాంటి వాటిమీద మక్కువ ఎక్కువ. కానీ ఏదయినా నాకు మాత్రమే అనుకునే వ్యక్తిత్వం కాదు ఉపాసన గారిది. ఆహారం విషయం లోనే తనకే కాదు దేశం లో ఏ ఒక్కరికీ పోషకాహార లోపమ్ వుండకూడదు అనుకునే వ్యక్తి ఆమె. దానికి నిదర్శనం ఆమె ఒకవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే మరోక వైపు సామాజిక సేవలు చేస్తున్నారు. మంచి ఆహారం , ఫిట్నెస్ , మనిషి ప్రశాంతం గా వుండడానికి కల కారణాలు ప్రజలకు కూడా తెలీయజేస్తున్నారు.

ప్రస్తుతo ఉపాసన గారు అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. బి – పాజిటివ్ అనే మాగ్జిన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ ఆమె. ఇటీవల యూ‌ఆర్‌లైఫ్ ను స్థాపించారు. దీని ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన సూచనలు తెలియ చేస్తున్నారు. సమంత అక్కినేని సాయం కూడా దీనికి లబిస్తుంది . అయితే తన ఈ ప్లాన్ ద్వారా ఉపాసనగారు తన లక్ష్యాన్ని సాదించేందుకు రామ్ చరణ్ ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.

“మన ఊరు మన భాద్యత “ అనే నినాదం తో గ్రామాల్లో వున్న ప్రతిభను ప్రపంచానికి చూపేందుకు ఉపాసన గారు కంకణం కట్టుకున్నారు. దివ్యనగులాయిన అమ్మాయిలు , అబ్బాయిలు యూ‌ఆర్‌లైఫ్ ప్లాట్ఫాం ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకెనదుకు షో ను నిర్వహిస్తున్నారు. దివ్యనగులలో , మానసికం గా భాద పడుతున్న వారిలో కూడా ఏదో ఒక టాలెంట్ వుంటుంది అని, అలా డాన్స్ లో సత్తా వున్నవాళ్ళని ప్రోత్సహించి అందరికీ తెలియచేసే ఉద్దేశంతో ఈ షో ని ఏర్పాటు చేసి , టాప్ కొరియోగ్రాఫర్స్ అయిన పరాఖాన్, ప్రభుదేవా తో పాటు రామ్ చరణ్ ని కూడా రంగం లోకి దింపి ఈ షో తో బాగం చేశారు.

ఈ టాలెంట్ షో ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ షోలో పాల్గొనడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . అక్టోబర్ 15 వ తేదీ లోగా urlife.co.in ను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవకాలి. ఈ డాన్స్ షో ను రెండు బాగలు అంటే మానసిక దివ్వ్యాయా౦గులు , భౌతీక దివ్యాoగులు అను కేటగిరీలు గా విడదీశారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభత్వం ఇచ్చిన దివ్యంగా దృవీకరణ పత్రం , ఒక ఫోటో తప్పని సరిగా వుండాలి.