Rashamika Mandanna Height తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా గొప్ప క్రేజ్ తో కొనసాగుతున్నారు రష్మిక మందన్న. తొలిసారిగా యువ దర్శకుడు నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల తీసిన ఛలో మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించిన రష్మిక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నారు.
వాస్తవానికి అంతకముందు రష్మిక మందన్న కన్నడలో కిరిక్ పార్టీ మూవీ ద్వారా సినీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. స్వతహాగా కర్ణాటకకి చెందిన రష్మిక ఫస్ట్ మూవీతోనే అక్కడి ఆడియన్స్ మనసు చూరగొన్నారు. ఆ మూవీలో యువ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఆ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఛలో మూవీ కోసం ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు వెంకీ.
Rashmika Mandanna Height in Feet
ఆ తరువాత తెలుగులో రష్మిక చేసిన మూవీ గీత గోవిందం. యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈమూవీని గీతా ఆర్ట్స్ సంస్థ పై అల్లు అరవింద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా పరశురామ్ పెట్ల దీనిని తెరకెక్కించారు. యూత్ఫుల్ లవ్ స్టోరీ గా ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన గీతా గోవిందం మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుని హీరోగా విజయ్ దేవరకొండకు అలానే హీరోయిన్ గా రష్మిక మందన్న కు భారీ క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా యువత లో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ ఎంతో పెరిగింది.
ఆ తరువాత నాని, నాగార్జున కాంబినేషన్ లో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసిన దేవదాసు మూవీలో నానికి జోడిగా ఒక ముఖ్య పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు రష్మిక. ఆ మూవీ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రష్మిక చేసిన మూవ్ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి తీసిన ఈ మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా రష్మిక కు బాగా క్రేజ్ తీసుకువచ్చింది.
ఆ తరువాత యువ నటుడు నితిన్ తో మరొక్కసారి వెంకీ కుడుముల తీసిన భీష్మ మూవీ చేసారు రష్మిక. ఆ మూవీ కూడా మంచి విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా రష్మిక కు బాగానే క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా అక్కడి నుండి మరింతగా కెరీర్ పరంగా దూసుకెళ్లారు రష్మిక. అనంతరం తమిళ్ లో కూడా వరుసగా రష్మిక మందన్నకు అవకాశాలు రాసాగాయి.
అదే సమయంలో అక్కడి స్టార్ నటుడు కార్తీ తో కలిసి ఆమె చేసిన మూవీ సుల్తాన్. అక్కడ మంచి విజయం అందుకున్న ఈ మూవీ రష్మికకు తమిళ ఆడియన్స్ నుండి కూడా పేరు తీసుకువచ్చింది. అదే సమయంలో భారీ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ లో పుష్ప 1 ది రైజ్ లో రష్మిక కు హీరోయిన్ గా అవకాశం లభించింది. తొలిసారిగా అల్లు అర్జున్ చేసిన ఈ ప్రాజక్ట్ ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది.
Rashmika Mandanna Height in Feet Wikipedia
ఇక ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రిలీజ్ అనంతరం పుష్ప మూవీ భారీ విజయం సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ గా రష్మిక కు కూడా బాగా క్రేజ్ తీసుకువచ్చింది. నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకున్న రష్మిక ఆపైన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల కలయికలో హారాను రాఘవపూడి తీసిన సీతారామంలో కూడా నటించారు.
అందులో రష్మిక ఒక కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో కలిసి గుడ్ బై మూవీలో నటించే అవకాశం వచ్చింది. అందులో అమితాబ్ కూతురిగా ఆకట్టుకునే నటన కనబరిచారు రష్మిక మందన్న. ఆ తరువాత హిందీలో సిద్దార్థ మల్హోత్రా తో ఆమె చేసిన మూవీ మిషన్ మజ్ను.
ఇక ఆ రెండు సినిమాలు హిందీ ఆడియన్స్ లో కూడా రష్మిక కు బాగా పేరు తీసుకువచ్చాయి. అటు తమిళ్ లో ఇలయదళపతి విజయ్ తో కలిసి వంశీ పైడిపల్లి తీసిన వరిసు మూవీలో నటించి అలరించారు రష్మిక. ఆ మూవీ కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. అయితే గత ఏడాది బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీలో రష్మిక కు హీరోయిన్ గా అవకాశం రావడం, తెరకెక్కిన అనంతరం పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయిన ఆ మూవీ భారీ విజయం సొంతం చేసుకోవడం జరిగాయి.
Rashmika Mandanna Height CM
ఇక ప్రస్తుతం హిందీలో చావా, తెలుగులో పుష్ప 2 రూల్ తో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ కండల వీరు సల్మాన్ తో సికందర్ సినిమాలు చేస్తున్నారు రష్మిక మందన్న. ఇక తరచు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫ్యాన్స్ ఆడియన్స్ తో ఎప్పటిపైకప్పుడో ఇంటరాక్ట్ అవుతూ వారితో పలు విషయాలు పంచుకుంటూ ఉంటారు.
మొదటి నుండి తన కష్టాన్ని నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను అని, అయితే ఈ స్థాయికి తాను చేరుకోవడానికి కారణమైన నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ముఖ్యంగా ప్రత్యేకంగా తన తల్లితండ్రులకు కృతజ్ఞతలు చెప్తారు రష్మిక మందన్న. మన శరీరంతో పాటు మనసు కూడా ఎప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎటువంటి పని అయినా చేయవచ్చని, అలానే ఒడిదుడుకులని మెల్లగా ఎదుర్కోని ముందుకు సాగితే తప్పకుండా విజయం మనల్ని వరిస్తుందని చెప్తారు రష్మిక.
ఇక అటు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో పాటు పలు సందర్భాల్లో ట్రెడిషనల్ వెర్ లో కూడా కనిపించి ఆకట్టుకుంటూ ఉంటారు రష్మిక. ఇక రష్మిక హైట్ 1.62 మీటర్లు, అదే అడుగుల లెక్కన చెప్పాలి అంటే 5 అడుగుల 4 అంగుళాలు. మొత్తంగా నటిగా రష్మిక మరిన్ని మంచి అవకాశాలు అందుకుని కెరీర్ పరంగా కొనసాగాలని కోరుకుందాం.