Rashmika Mandanna Movies List తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా 2018లో ఛలో మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆ మూవీలో యువ నటుడు నాగ శౌర్య హీరోగా నటించగా వెంకీ కుడుముల దానిని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇక ఆ మూవీలో కార్తీక పాత్రలో తన ఆకట్టుకునే అందం అభినయంతో తెలుగు ఆడియన్స్ ని అలరించారు రష్మిక మందన్న. అయితే అంతకముందు కన్నడలో ఆమె కిరిక్ పార్టీ, అంజనీ పుత్ర, చమక్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
అటు కన్నడలో మంచి పేరు అందుకున్న రష్మికకు తెలుగు లో ఫస్ట్ మూవీ ఛలో బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల తెరకెక్కించిన గీత గోవిందంలో నటించారు రష్మిక. ఆ మూవీ మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఇక గీత గోవిందం మూవీతో తెలుగులో యువత మనసులో మంచి స్థానం సంపాదించడంతో పాటు నటిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారు రష్మిక.
Rashmika Mandanna Movies List 2024
ఆ తరువాత నాగార్జున, నాని ల కాంబినేషన్ లో రూపొందిన దేవదాసు మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన రష్మిక, ఆపైన మరొక్కసారి విజయ్ దేవరకొండ తో కలిసి యువ దర్శకుడు భరత్ కమ్మ తీసిన డియర్ కామ్రేడ్ లో లేడీ క్రికెటర్ గా ఆకట్టుకున్నారు. అందులో ఎమోషనల్ సీన్స్ లో రష్మిక నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. అయితే అదే సమయంలో ఆమెకు ఏకంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. ముఖ్యంగా ఈ మూవీలో సూపర్ స్టార్ కి జోడీగా నటించిన రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో యువ నటుడు నితిన్ హీరోగా రూపొందిన భీష్మ మూవీలో నటించారు రష్మిక. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఆ మూవీ విజయం కూడా హీరోయిన్ గా రష్మిక క్రేజ్ మరింత పెంచింది.
ఇక ఆపై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 1 ది రైజ్ లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించారు రష్మిక మందన్న. 2021 డిసెంబర్ లో భారీ అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప 1 మూవీ భారీ విజయం నటిగా రష్మిక క్రేజ్ ని అమాంతం నేషనల్ వైడ్ కి తీసుకెళ్లింది.
Rashmika Mandanna Movies List 2025
ముఖ్యంగా ఆ మూవీలో పుష్ప రాజ్ ని ఇష్టపడే యువతిగా శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన, డ్యాన్స్ అందరినీ అలరించింది. అక్కడి నుండి కెరీర్ పరంగా అటు తమిళ అలానే వరుసగా హిందీలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లారు రష్మిక. తమిళ్ లో ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తీసినా వరిసు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక ఆ మూవీ సక్సెస్ తో తమిళ ఆడియన్స్ నుండి కూడా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక అటు హిందీలో అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో చేసిన గుడ్ బై, అలానే సిద్దార్ధ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను సినిమాల్లో నటించారు రష్మిక. అయితే అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. అయినప్పటికీ ఆయా సినిమాల్లోని తన పాత్రల్లో ఆకట్టుకునే నటనా కనబరిచిన రష్మిక అటు హిందీ ఆడియన్స్ మనసు కూడా దోచారు. ఇక గత ఏడాది 2023 డిసెంబర్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన ఆనిమల్ మూవీలో హీరోయిన్ గా నటించారు రష్మిక మందున్న.
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆ మూవీ తెలుగు, హిందీ తో పాటు పలు ఇతర భాషల్లో భారీ విజయం అందుకుని దాదాపుగా బాక్సాఫీస్ వద్ద రూ. 950 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. వాస్తవానికి ఆనిమల్ మూవీ పై కొంత విమర్శలు వెల్లువెత్తినప్పటికీ కూడా కలెక్షన్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ సినిమాలు ఉన్నాయి.
Rashmika Mandanna Movies List Latest
అల్లు అర్జున్ తో కలిసి సుకుమార్ తీస్తున్న పుష్ప 2 లో హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మిక. ఈ మూవీ డిసెంబర్ 6న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక మరోవైపు నాగార్జున, ధనుష్ ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తీస్తున్న పాన్ ఇండియన్ మూవీ కుబేరాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మీక. ఈమూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.
అలానే అటు హిందీలో విక్కీ కౌషల్ హీరోగా చేస్తోన్న చావా మూవీలో కూడా రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ఈమూవీ సికందర్ లో హీరోయిన్ గా రష్మిక ఎంపికయ్యారు.
Rashmika Mandanna Movies List
ప్రస్తుతం శరవేగంగా ఆ మూవీ షూట్ జరుపుకుంటోంది. మొత్తంగా నటిగా తన సినీ ప్రస్థానాన్ని 2016లో ప్రారంభించిన కన్నడ అందాల భామ నేషనల్ క్రష్ రష్మిక మందన్న అక్కడి నుండి ఒక్కొక్కటిగా తనకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెరీర్ పరంగా మంచి క్రేజ్, మార్కెట్ తో కొనసాగుతున్నారు.
అయితే తన కెరీర్ బిగినింగ్ లో తన తొలి చిత్ర కన్నడ నటుడు రిషబ్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రష్మిక. అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారి వివాహం జరుగలేదు. ఇక అక్కడి నుండి మరింతగా కెరీర్ పై ఫోకస్ పెట్టిన రష్మిక, ఇకపై మరింతగా ఆడియన్స్ ని అలరించే పాత్రల్లో నటించాలని ఉందని, అలానే ఎప్పుడూ తనువు, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఏదైనా మనిషికి సుసాధ్యం అని అంటారు రష్మిక.