Return of the Dragon Movie Review - Intresting youthful Entertainer

Return of the Dragon Movie Review 2022లో వచ్చిన లవ్ టుడే మూవీ ద్వారా పెద్ద విజయం సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్. ఈ మూవీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా విశేషంగా

Return of the Dragon Movie Review - Intresting youthful Entertainer

2022లో వచ్చిన లవ్ టుడే మూవీ ద్వారా పెద్ద విజయం సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్. ఈ మూవీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆయన హీరోగా రూపొందిన మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

సినిమా పేరు : రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 

రేటింగ్ : 3.5 / 5

తారాగణం : ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కె ఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్ 
తదితరులు 

దర్శకుడు : అశ్వత్ మారిముత్తు

సంగీతం : లియోన్ జేమ్స్ 

సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి 

రిలీజ్ డేట్ : 21 ఫిబ్రవరి 2025

కథ : 

మంచి ర్యాంకింగ్ స్టూడెంట్ అయిన రాఘవన్ (Pradeep Ranganathan) తన ఇంటర్మీడియట్ లో 96 శాతం మార్కులు సంపాదించి, అనంతరం మంచి డిగ్రీ కాలేజీలో సీటు దక్కించుకుంటాను. అయితే అనుకోకుండా అక్కడి ఒక అమ్మాయి కారణంగా అతడు బ్యాడ్ బాయ్ గా మారతాడు. 

ఇక జరిగిన తన ఇంజినీరింగ్ లో ఏకంగా 48 సబ్జక్టుల్లో తప్పిన రాఘవన్, ఆ కాలేజీలోని కీర్తి (Anupama Parameswaran) తో ప్రేమలో పడడం, అనంతరం ఇద్దరు ప్రేమించుకోవడం, ఆపై ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. ఆ తరువాత కొన్నాళ్లకు ఎలాగో కష్టపడి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి మంచి స్థాయికి ఎదుగుతాడు. 

అదే సమయంలో పల్లవి (Kayadu Lohar) కి కూడా పెళ్లి సెట్ అవుతుంది. కాగా అదే సమయంలో అనుకోకుండా రాఘవన్ జీవితంలోకి కాలేజీ ప్రిన్సిపాల్ వస్తాడు. మరి అతడు సడన్ గా రాఘవన్ లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు. ఇంతకీ పల్లవికి పెళ్లి అయిందా, మరి రాఘవన్ కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన కీర్తి ఏమైంది, చివరికి రాఘవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది మొత్తం కూడా (Return of the Dragon) మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ గురించి. గతంలో లవ్ టుడే మాదిరిగా ఈమూవీలో కూడా మరొక్కసారి తన పాత్రలో సహజంగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. 

పలు కీలక యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అతడి యాక్టింగ్ మరింత బాగుంది. అతడి తండ్రి పాత్రలో కనిపించిన జార్జి మేరియన్ కూడా ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్స్ అయిన అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ ఇద్దరూ కూడా తమ ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. 

అలానే కీలక పాత్రల్లో నటించిన మిస్కిన్ నటన, పాత్రలో పలికే డైలాగ్స్ బాగున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో పాటు హర్షిత్ కన్నా సహా మొత్తం పాత్రధారులు అందరూ కూడా తమ యొక్క పరిధి మేరకు అలరించారు. 

ప్లస్ పాయింట్స్ : 

ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే 

ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ 

ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ 

హృద్యమైన ఎమోషన్స్ 

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా స్లోగా సాగడం 

రెగ్యులర్ కథ, కథనం

విశ్లేషణ : 

ముందుగా ఈ మూవీ కోసం దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎంచుకున్న పాయింట్ బాగుంది. యువతని ఆకట్టుకునే రీతిలో నేటి సమాజంలో ఫేక్ జాబ్స్ విషయమై మోసపోతున్న అంశాన్ని బాగా చూపించారు. దానిని యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించిన తీరు బాగుంది. కథనాన్ని నడపడంలో తీసుకున్న పాయింట్ ని కామెడీగా ఒకింత యాక్షన్ తో నడిపారు. 

ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే ఈ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. ముఖ్యంగా కథ, కథనాలు మనకు రొటీన్ గా అనిపించినా అలానే అక్కడక్కడా స్లో పేస్ లో సాగినా ఓవరాల్ గా అయితే సినిమా రేసిగా తీసే ప్రయత్నం చేసారు. యువత అయితే ఈ మూవీకి బాగా ఎట్రాక్ట్ అవుతారని చెప్పాలి. సాంగ్స్, తో పాటు ఎలివేషన్, మాస్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. 

అలరించే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు విజువల్స్ కూడా కొన్ని సీన్స్ లో బాగుంటాయి. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథన్ తన రాఘవన్ పాత్రకి జీవం పోశారు. హీరోయిన్స్ ఇద్దరూ కూడా గ్లామర్ అలానే పెర్ఫార్మన్స్ తో అలరించారు. 

తీర్పు : 

మొత్తంగా మంచి అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ మంచి ఎంటర్టైనింగ్ గా సాగె ఇంట్రెసింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించే ఈ మూవీ సెకండ్ హాఫ్ బాగుంటుంది. అలానే కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్ వంటివి బాగున్నాయి. ఓవరాల్ గా ఈవారం మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఈ మూవీ చూసేయవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow