చిరంజీవి గారి కోసం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లెక్కచెయ్యకుండా హడావిడిగా ఇంటికి బయదేరిన రామ్ చరణ్

కరోనా మహమ్మారి ఇప్పటికి ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజల నుండి సినీ హీరోల దాకా వ్యాపిస్తునే ఉంది. తాజగా మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్నీ సోమవారం ఆయనే తన ట్విట్టర్ కాత ద్వారా స్వయంగా పోస్ట్ చేసి తెలియచేసాడు. చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు టెస్ట్ పాజిటివ్ అని తేలింది. ఏ మాత్రం సీంప్టోమ్స్ లేకుండా పాజిటివ్ రావటంతో చిరంజీవి గారు షాక్ అయ్యారు, అలాగే నన్ను కలిసిన వాళ్ళు అందరూ టెస్ట్ చేయించుకోవలసింది గా చిరంజీవి తెలియచేసాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది అయితే చిత్ర యూనిట్ మొత్తం టెస్ట్ చేయించుకొని నెగటివ్ రిపోర్ట్స్ తెస్తే షూటింగ్ కు అనుమతి ఇవ్వాలి అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది అయితే చిరంజీవి గారికే కరోనా రావటంతో టీం మొత్తం ఆందోళనా లో పడింది. దీంతో ఆచార్య షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. ఈ సినిమా లో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సెట్ నుంచి హడావిడిగా చిరంజీవి గారి ఇంటికి బయలుదేరినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం చిరంజీవి గారి సోదరుడు నాగబాబు గారు కూడా కరోనా బారిన పది కోలుకున్నారు. అలాగే చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిధం.