నాగసౌర్య కి చేతులెత్తి దండం పెడుతున్నాను

ప్రతి ఒక్కడి లైఫ్‌లోనూ 2 టార్గెట్స్‌ ఉంటాయ్‌. ఒకటి ఇల్లు. రెండోది పెళ్లి. ఆ టార్గెట్స్‌ నాకూ ఉన్నాయి అంటున్నాడు విజయ్‌ రాజా. ఈయన హీరోగా రామ్స్‌ రాథోడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. తమన్నావ్యాస్‌ నాయిక. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో విజయ్‌ రాజా దర్శకుడి పాత్రలో కనిపించాడు. భయపడే డైరెక్టర్‌ కాదురా భయపెట్టే డైరెక్టర్‌ అని హీరో చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులందరినీ అలరిస్తోంది. హీరోయిన్ తమన్నా వ్యాస్‌ తన అందంతో ఆకట్టుకుంటోంది.

మరి హీరో తాను అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హీరో సునీల్ ఈ చిత్రం యొక్క టీజర్‌ను విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ చిత్రం ద్వారా హీరోహా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ రాజా మరెవ్వరో కాదు. ప్రముఖ సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడే. టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ “జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరోగా నటిస్తున్న చిత్రం “వెయ్యి శుభములు కలుగు నీకు”. ఈ చిత్రం క్లాప్ హీరో నాగశౌర్య చేయగా హీరో నాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇప్పుడు హీరో సునీల్ ఈ చిత్రం యొక్క మొదటి టీజర్‌ను విడుదల చేసారు, నేను ముఖ్యంగా ఈ సందర్భంగా ముగ్గురుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకరు నా ఫ్యామిలీ మెంబర్, హీరో నాగశౌర్య.. రెండో వ్యక్తి హీరో నాని.. మూడో వ్యక్తి మా బ్రదర్ సునీల్.

ఈ సినిమా కోసం నేను అడిగిన వెంటనే వారు చేసిన సాయానికి చాలా చాలా థ్యాంక్స్. నిజానికి వాళ్ళ ముగ్గురూ చేసిన సహాయానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్నపదం. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు మా విజయ్ పుట్టినరోజున డైరెక్టర్ రామ్స్ రాథోడ్ కథ చెప్పారు. సినిమా షూటింగ్ టాకీ అంతా పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ బాలన్స్ ఉంది. మా అబ్బాయి విజయ్ రాజాకి మంచి నిర్మాత, మంచి దర్శకుడు దొరికారు. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. టీజర్ చాలా వచ్చింది. ఇప్పటివరకూ నన్ను ఆశీర్వదించినట్టే నా కుమారుడుని కూడా ఆశీర్వదించండి’’ అని తెలియజేసారు.