శ్రీహరి కొడుకు ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయ్యాడో తెలుసా ?

సీనియర్ యాక్టర్ రియల్ స్టార్ శ్రీహరి గారు ఎన్నో సినిమాలో తెలుగు,తమిళ్,హిందీ భాషలో నటించి ప్రేక్షకులని గెల్చుకున్నారు, స్టంట్ ఫైటర్ గా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు,సినిమా లో రాకముందు జిమ్నాస్టిక్స్ అథ్లెట్ కూడా పోలీస్ మరియు రైల్వే ఆఫీసర్ పోస్ట్ కి ఆఫర్స్ కూడా వచ్చాయి అవన్నీ వద్దు అని సినిమాలో ఆశక్తి ఉందని ఎంట్రీ ఇచ్చారు.

శ్రీహరి గారు యాక్టర్ డిస్కో శాంతి గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్లకి ముగ్గురు పిల్లలు,2 కుమారులు ఒక కుమార్తె అయితే కుమార్తె అక్షరా కి నాలుగు నెలల వయస్సు ఉన్నపుడు మరిణించింది. అక్షరా జ్ఞాపకార్థం తో అక్షరా ఫౌండేషన్ ప్రారంభించారు.ఇది గ్రామాలకు ఫ్లోరైడ్ లేని నీరు మరియు విద్యార్థులకు పాఠశాల సామాగ్రిని సప్లై చేయడం హెల్ప్ చేస్తారు.

మేడ్చల్ లో నాలుగు గ్రామాలను కూడా దత్తత తీస్కున్నారు.విల్లన్ గా చాలా సినిమాలో నటించారు తాజ్ మహల్ సినిమాకి బెస్ట్ విల్లన్ గా నంది అవార్డు మరియు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా గెల్చుకున్నారు.శ్రీ రాములయ్య,పోలీస్ ,రామసక్కనోడు,విజయ రామ రాజు ఈ సినిమాలకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గెలిచారు.

మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు, ఎలాంటి క్యారెక్టర్ అయిన ఈజీ గా చేసేస్తారు,అర్.రాజ్ కుమార్ హిందీ మూవీ షూటింగ్ లో ఉన్నపుడు ఆరోగ్యం బాగోలేక లీలావతి హాస్పిటల్ లో లివర్ ప్రాబ్లెమ్ తో మరణించాడు,అయితే పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి సినిమాలో అడుగు పెట్టాడు.

ప్రస్తుతం మేఘాంశ్ నటించబోయే సినిమా కోతి కొమ్మచ్చి సతీష్ వేగేశ్న దర్శకత్వం లో రాబోతుంది,శతమానం భవతి సినిమాతో సూపర్ హాట్ కొట్టాడు సతీష్, ఆ తర్వాత వచ్చిన ఎంతమంచివాడివురా సినిమా పెద్దగా ఫలితం తీసుకురాలేదు, ఇపుడు కోతి కొమ్మచ్చి అనగానే ముళ్ళపూడి వారి జీవిత కథ గుర్తొస్తుంది ఆ టైటిల్ తో అందరిని నవ్వించారు,ఈ సినిమా లో 2 కోతుల కథ సతీష్ కి ఈ సినిమా తో దర్శకుడిగా నిరూపించుకోవాలి అలానే తనయుడు కి మంచి మార్గం చూపించాలని ప్రయత్నం తో ఈ సినిమా రూపొందింది త్వరలో మన ముందుకి పూర్తీ వివరాలు రాబోతున్నాయి వేచి చూద్దాం.