ఎందుకు మిత్రమా ఇలా వదిలేసి వెళ్లిపోయావ్ మాట్లాడుతూనే కనిళ్ళు పెట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్

మనం శోకించాల్సిన విషయం! ఎస్ పీ బాలు నా మిత్రుడు కరోనా నిమ్మితం చికిత్స తీసుకుంటూ ఇప్పటిదాకా పోరాడి ఊపిరి వదిలారు. నామితృడు ఎన్నో భాషలలో తన గాన మాధుర్యాన్ని ప్రజలకి అందించాడు.ఈ వార్త అందరిని శోకంతో ముంచింది. మిత్రమా అన్యాయం చేసి వెళ్లిపోయావ్. ఎందుకు మిత్రమా ఇలా చేసావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గత కొద్దీ రోజులు గా గాన గంధర్వుడు SP బాల సుబ్రమణ్యం గారు కోవిడ్ బారిన పది హాస్పిటల్ లో చికిత్స తీసుకోడం మన అందరికి తెలిసిందే.అయితే గురువారం రాత్రి నుండి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడ్డ ఆయన, శుక్రవారం మధ్యాహ్నం వెంటిటలేటర్ల పైనే అయన తుది శ్వాస విడిచారు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు అనుకున్న అభిమానులను శోకసంద్రం లో ముంచేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.Sp బాలు గారు ఈ రోజు మధ్యాహ్నం 1:04 నిమిషాలకు మరణించినట్లు అయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయం గా ధ్రువీకరించారు.

చెన్నై లో ని మౌంట్ రోడ్ సత్యం థియేటర్ వద్దకు బాలు గారి భౌతిక కాయం తరలించే అవకాశంవుంది. ఆగష్టు 5 న కరోనా పాజిటివ్ అని తెలియగానే చెన్నై లోని ఎం .జి .ఏ హాస్పిటల్ లో చేరారు. యాబై రోజులుగా వెంటిలేటర్ల పైనే చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించారు. బాలు గారి మరణ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులను శోకం లో ముంచేసింది. ఈ వార్త వినగానే పలువురు సినీ స్టార్స్ మరియు రాజకీయ నేతలు తమ సానుభూతిని తెలియచేస్తూ, బాలు గారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.