మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ప్రవర్తన గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

చిరంజీవి గారి గురించి మన అందరికి తెల్సిందే,అయినా మంచి టాప్ యాక్టర్ ఎన్నో సినిమాలు హిట్ కొట్టి టాప్ పోసిషన్ లో ఉన్నారు,చిరంజీవి గారు సురేఖ గారిని పెళ్లి చేస్కునే అప్పటికి ఇంకా మెగాస్టార్ కాలేదు వర్ధమాన నటుడు గా అపుడే చిన్న పత్రాలు వేస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు,అసలు వాళ్ల ఇద్దరి పెళ్లి కి ముందు పరిచయం ఎలా జరిగింది. చిరంజీవి గారు మనవూరి పాండవులు లో అల్లు రామలింగయ్య గారి తో ఒకటే సినిమాలో నటిస్తున్నారు.అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని బాగా అబ్సర్వ్ చేసారు.

ఒకరోజు రామలింగయ్య గారు మద్యం తీసుకుంటు ఉండగా చిరంజీవి గారిని కూడా మద్యం తీసుకోమంటే నాకు అలవాటు లేదండి నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అని చెప్పారు,ఆంజనేయ స్వామి భక్తులు మందు తీసుకోరా అని నవ్వుకుంటూ ఉన్నారు, రామలింగయ్య గారి ఇంట్లో రెంట్ కి ఉంటున్నారు సత్యనారాయణ మిత్రుడు చిరంజీవి కి అల్లు రామలింగయ్య గారికి కి బాగా తెల్సిన వ్యక్తి ఎపుడు సత్యనారాయణ గారిని కలుసుకోవడానికి చిరంజీవి గారు అపుడపుడు వచ్చి వెళ్తుంటారు .

అల్లు రామలింగయ్య సతీమణి,చిరంజీవి గారిని గమనించారు, ఈ కుర్రవాడు బుద్దిమంతుడుల కనిపిస్తున్నారు మన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నంగా ఈ అబ్బాయి గురించి వివరాలు తెలుసుకోమని అడిగారు వారి సతీమణి ,చిరంజీవి మీద మంచి అభిప్రాయం ఉండటం తో సరే అన్నారు అల్లు రామలింగయ్య,మిగతా వివరాలు తెల్సుకుందాం అని సత్యనారాయణ గారిని పిలిచి చిరంజీవి గురించి అడిగారు,ఆ కుర్రవాడు మంచివాడే అని మంచి రిపోర్ట్ ఇచ్చే సరికి దంపతులకు మంచిఅభిప్రాయం వచ్చింది, అల్లు అరవింద్ గారిని పిలిచి అయినా అభిప్రాయం అడిగితే చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్ కన్నుకోవాలి కదా అని ఎంక్వయిరీ చేసారు.

అల్లు అరవింద్ కి చిరంజీవి కి కామన్ ఫ్రెండ్ రూపశిల్పి ,జయకృష్ణ గారిని కలిసి వాళ్ల అభిప్రాయం చెప్పారు,వాళ్ల పెళ్లి చూపుకి ఏర్పాటు చేసారు, చిరంజీవి పెళ్లి చూపులకి రాలేను మా తండ్రి తండ్రులు ని చూసి రమ్మన్నారు కానీ వాళ్ళు చిరంజీవి ని కూడా చూడాలని అడిగారు,పెళ్లి చూపులు లో సురేఖ గారిని మొదటిసారి చూసారు చిరంజీవి గారు కానీ సురేఖ గారు మనవూరి పాండవులు లో చూసారు చిరంజీవి గారిని ఈ సైకిల్ అబ్బాయి కొంచెం డిఫరెంట్ గా ఉన్నారని అనుకున్నారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సినిమాలో నెగటివ్ రోల్ వేసారు చిరంజీవి గారు, ఆ సినిమా చూసాక మంచి నటుడు అని అభిప్రాయం వచ్చింది,సురేఖ గారికి చిరంజీవి మీద ఇష్టం పెరిగింది.

20 ఫిబ్రవరి 1980లో పెళ్లి చెన్నైలో రాజేశ్వరి కల్యాణ మండపం లో జరిగింది.పెళ్లి అయినా తరువాత సురేఖ గారి వేళా విశేషం, చిరంజీవి గారికి మంచి సినిమాలు హిట్ లు మంచి పేరు వచ్చింది.సురేఖ గారు మిగతా హీరోయిన్ తో క్లోజ్ గా నటించడం చూసి గొడవలు పెట్టుకోడం జరిగింది అని పుకార్లు వచ్చాయి.వాళ్ల సోదరులు తో కూడా సరిగ్గా చూడట్లేదని ,చిరంజీవి ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టామని చెప్పారని పుకార్లు వచ్చాయి. నిజానికి సురేఖ గారు చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు.అలంటి ఆలోచన నాకు ఉండదు అని చెప్పారు ,చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు.