ప్రతి ఒక్క అభిమాని గర్వించేలా చేసిన మెగాస్టార్ .. అందరినీ మెగా మనసుతో కొల్లగొట్టాడు ….

కరోన కాలం మొదలైన తర్వాత చిరంజీవి గారు ఎవరికి ఏ సమస్య వచ్చిన తాను వున్నానoటూ భరోసా ఇస్తున్నాడు. “కరోన క్రైసిస్ చారిటీ “ అని ఒక ట్రస్ట్ ని పెట్టి దాని ద్వారా పేద కళాకారులు తో పాటు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు తోచిన సహాయం చేస్తూనే వున్నారు. అయితే ప్లాస్మా దానం ద్వారా మెగాస్టార్ చిరంజీవి మెగా మనసును చాటుకున్నారు. సహయం చేయడానికి ఇలాంటి వాటిల్లో ముందడుగేసి ముందు నిలుచున్న చిరు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ప్రాణదాత గా నిలిచాడు.ఇప్పటికీ తనకోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానాన్ని ప్రజల్లో సంపాదించుకున్నాడు అంటే ఆయన చేసే పనులే ఇందుకు నిదర్శనం.

సినీ ఇండస్ట్రి లో తన ఎదుగుదలకు కారణమైన అభిమనుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపించే హీరోలలో చిరంజీవి గారు ముందు వరుసలో వుంటారు. 90 వ దశకం లోనే చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందించి నిజమైన ఆపద్భాంధవుడు అనిపించుకున్నాడు. కళ్ళు లేని వారికి ఎంతో మందికి చూపును కూడా ప్రసాదించారు. ముందు చూపుతో ఏర్పాటు చేసిన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ తో కరోన బాదితులకు సేవలందిస్తున్నారు. కరోన నుండి కొలుకున్నవారిలో యాంటీ బోడి లు ఉత్పత్తి అవుతాయి. వారి నుంది ఆ యాంటీ బోడి లు సేకరించి కరోన రోగులకు చికిత్స చేయడమే ప్లాస్మా పద్ధతి.

ప్రస్తుతం ఈ కరోన నేపధ్యం లో కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు తట్టుకోలేక ఎంతో మంది పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారు. వీరికోసం చిరంజీవి గారు మరొక సారి తన వంతు భాద్యతని నిర్వహించడానికి చేసిన ప్రయతనం ప్లాస్మా దానం. ఇటీవల దానికోసం వెలువడిన నోటిఫికేషన్ లో వివరాలు ఇలా వున్నాయి.చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ సoస్ట నుండి పేదలకు ఉచితం గా కోవిడ్ –ప్లాస్మా . పచ్చటి జీవితలపై కర్మశ కరోన పంజా విసురుతూ చిన్న భిన్నం చేస్తుంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగణమవుతుంది. ఈ పరిస్తితి నుండి పెద రోగుల్ని కాపాడేందుకు చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది.

కరోన సోకి రోగ విముక్తిలయిన వారు ప్లాస్మా దానం చేస్తే మరి కొంతమందికి ఆయుష్ దానం చేసినట్లే. ఈ నేపధ్యం లో కరోన సోకిన పేద రోగులకు ప్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డులు , ప్రబుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు చిరంజీవి బ్లడ్ బాణలక ఉచితం గా ప్లాస్మా సరపరా చేస్తుంది.

పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విన్నపం. 22 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరాజీవి గారు స్వంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితం గా రక్త నిధులు అందిచాలన్న విషయాన్ని ఈ సందర్భం గా తెలియచేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం.

లేటెస్ట్ గా సి. యి . ఓ ఆఫ్ చిరంజీవి ఐ & బ్లడ్ విడుదల చేసిన ఈ నోటిస్ మేరకు చాలామంది అభిమానులు చిరంజీవి గారు చేసిన ఈ పనికి గర్వం గా చెప్పుకుంటూ వారుకూడ తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. మన హీరో చేసే ప్రతి మంచి పని ప్రజల్లో , అభిమనులలో చైతన్య తీసుకొచ్చేలా వుంటుంది. ఆయన వెచ్చించిన మార్గాలు పది మందికి దారి చూపుతూ , పది మందిని ఆ దారిలో నడిచేలా చేస్తాయి.