Tollywood Gossips టాలీవుడ్ లో త్వరలో పలు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండగా తాజాగా పలు సినిమాలు ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, సూర్య కంగువ సినిమాలు బాగానే విజయాలు అందుకున్నాయి. వాటితో పాటు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ కూడా భారీ విజయం అందుకుంది. ఇక త్వరలో మరికొన్ని సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి.

Tollywood Gossips

Tollywood Gossips

పుష్ప 2 ది రూల్ : Pushpa 2 The Rule ముఖ్యంగా డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్న మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతోన్న ఈ మూవీలో యువ అందాల నటి శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పుష్ప 2 నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప 2 గురించి వినిపిస్తున్న గాసిప్ ప్రకారం ఈ మూవీని ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో డిసెంబర్ 5న అన్ని ఏరియాల్లో కూడా దాదాపుగా అందుబాటులో ఉన్న అన్ని థియేటర్స్ లో ప్రదర్శించాలనేది మేకర్స్ ఆలోచన అంటున్నారు. ఈ మేరకు టీమ్ కూడా ప్లాన్ చేస్తోందట. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ రేట్స్ పెంపు గురించి కూడా ఆయా ప్రభుత్వాలని కలిసి మాట్లాడనున్నారు మేకర్స్.

Tollywood Gossips Reddit

గేమ్ ఛేంజర్ : Game Changer అలానే మరొక భారీ మూవీ గేమ్ ఛేంజర్ పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. జనవరి 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ తీస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అందరిలో మంచి హైప్ కలిగిన గేమ్ ఛేంజర్ గురించి తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న గ్యాసిప్ ప్రకారం ఇందులోని ఒక సాంగ్ ని దర్శకుడు శంకర్ దాదాపుగా రూ. 50 కోట్ల మేర వ్యయంతో ఎంతో గ్రాండియర్ గా తెరకెక్కించారట. రేపు థియేటర్స్ లో ఈ సాంగ్ కి ఆడియన్స్, చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. మూవీ ఖర్చు కూడా భారీగా ఉండడంతో గేమ్ ఛేంజర్ కూడా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ది రాజా సాబ్ : The Raja Saab ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రభాస్ తీస్తున్న ది రాజా సాబ్ పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈమూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు హర్రర్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ అలరించాయి. నిధి అగర్వాల్, ప్రియాంక మోహన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

Tollywood Gossips

Tollywood Gossips

Tollywood Gossips Tupaki

ఈ మూవీ హర్రర్ కామెడీ జానర్ లో రూపొందుతుండగా ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, టాలీవుడ్ వర్గాల గాసిప్ ప్రకారం త రాజా సాబ్ మూవీలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనుండగా ఆయనకు తాతయ్య పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారట. తప్పకుండా ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విశ్వంభర : Vishwambhara ఇక ఈ మూవీస్ అనంతరం ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోన్న మూవీ విశ్వంభర. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ గా హైప్ ఏర్పరిచింది. ఎం ఈమె కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు.

ఈ మూవీ చూస్తే కొన్నేళ్ల క్రితం మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుందని, ఆ స్థాయిలో ఈ సోషియో ఫాంటసీ మూవీని దర్శకుడు వశిష్ట ఎంతో అద్భుతంగా తీస్తున్నారని విశ్వంభర మేకర్స్ అంటున్నారు. అయితే టాలీవుడ్ గాసిప్ ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటారట. ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి తో పాటు మరొక నటి కూడా ఉంటారట. ముఖ్యంగా వింటేజ్ మెగాస్టార్ ని ఇందులో చూడడంతో పాటు మెగాఫ్యాన్స్ ని అలానే నార్మల్ ఆడియన్స్ ని కూడా విశ్వంభర మూవీ ఆకట్టుకుంటుందట.

Tollywood Gossips in Telugu

హరి హర వీర మల్లు : Hari Hara Veera Mallu ఇక మరొక మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తోన్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీ పై కూడా పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు పార్ట్స్ గా రూపొందుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఏ ఎం రత్నం ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తూన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ యొక్క కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మిగతా భాగాన్ని ప్రస్తుతం ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, టాలీవుడ్ గాసిప్ ప్రకారం హరి హర వీర మల్లు మూవీలో గజ దొంగ వీర మల్లు గా పవన్ ఇందులో కనిపించనుండగా మూవీలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే ఎంతో అద్భుతంగ వచ్చాయట. బాబీ డియోల్ తో కలిసి పాల్గొన్న ఒక పవర్ఫుల్ ఫైట్ అదిరిపోతుందని అంటున్నారు. మొత్తంగా అందరిలో ఎంతో హైప్ కలిగిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఇది ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Tollywood Gossips

Tollywood Gossips

Tollywood Gossips Gulte

Categorized in: