మెగాస్టార్ కి చెల్లిగా నటించబోతున్న ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోయిన్

సై రా నరసింహ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని కూడా ఆ చిత్ర బృందం విడుదల చేసింది.దాదాపుగా 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది, వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ఈ దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, త్వరలోనే రామ్ చరణ్ ఈ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు.ఒక్కపక్క ఆచార్య సినిమాలో నటిస్తూనే మరో పక్క మెహర్ రమేష్ తో మరో సినిమా చెయ్యడానికి మెగాస్టార్ సన్నాహాలు మొదలు పెట్టేసాడు, తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమాని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చెయ్యబోతున్నారు.ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన గెట్ అప్స్ లో కనిపించనున్నారు, అందులో ఒక్క గెట్ అప్ గుండు తో ఉంటుంది, ఇటీవలే దీనికి సంబందించి టెస్ట్ లుక్ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నాడు మెగాస్టార్.

ఇప్పటి వరుకు ఎప్పుడు చూడని విధంగా మెగాస్టార్ ని గుండు లుక్ లో చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోయారు, ఇక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లి పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నట్టు సమాచారం.ఇటీవలే మెహర్ రమేష్ ఆమెతో చర్చలు కూడా జరిపాడు అట, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.