బాలు గారికి చావు లేదు అయన పాటలు చిరస్మరణీయం మాట్లాడుతూనే ఏడ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

కొందరికి వయస్సు రాదు, కొందరికి మరణం ఉండదు. బాలు గారు కూడా వాళ్లలో ఒకరు. అయన ప్రతిభ అపారం. అయన కీర్తి అమోగం.అయన పాట చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకి ప్రపంచం నలుమూలల ఉన్న అయన అభిమానులకి (వారిలో నేను కూడా ఒకడిని) అందరికి న ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అంటూ భాదాకరమైన హృదయం తో మాట్లాడారు త్రివిక్రమ్ గారు.

గత కొద్దీ రోజులు గా గాన గంధర్వుడు SP బాల సుబ్రమణ్యం గారు కోవిడ్ బారిన పది హాస్పిటల్ లో చికిత్స తీసుకోడం మన అందరికి తెలిసిందే.అయితే గురువారం రాత్రి నుండి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడ్డ ఆయన, శుక్రవారం మధ్యాహ్నం వెంటిటలేటర్ల పైనే అయన తుది శ్వాస విడిచారు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు అనుకున్న అభిమానులను శోకసంద్రం లో ముంచేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.Sp బాలు గారు ఈ రోజు మధ్యాహ్నం 1:04 నిమిషాలకు మరణించినట్లు అయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయం గా ధ్రువీకరించారు.

చెన్నై లో ని మౌంట్ రోడ్ సత్యం థియేటర్ వద్దకు బాలు గారి భౌతిక కాయం తరలించే అవకాశంవుంది. ఆగష్టు 5 న కరోనా పాజిటివ్ అని తెలియగానే చెన్నై లోని ఎం .జి .ఏ హాస్పిటల్ లో చేరారు. యాబై రోజులుగా వెంటిలేటర్ల పైనే చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించారు. బాలు గారి మరణ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులను శోకం లో ముంచేసింది. ఈ వార్త వినగానే పలువురు సినీ స్టార్స్ మరియు రాజకీయ నేతలు తమ సానుభూతిని తెలియచేస్తూ, బాలు గారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.