ఉప్పెన ఫుల్ మూవీ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

ఇటీవల కాలం లో పాటల దగ్గర నుండి సినిమా వరుకు యువత ని ఒక్క ఊపు ఊపేసిన సినిమా ఉప్పెన, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల అయ్యి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డు కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,అప్పటికే లాక్ డౌన్ తర్వాత సంక్రాంతి కానుకగా విడుదల అయినా మాస్ మహా రాజా రవితేజ క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ కి పూర్వ వైభవం తీసుకొస్తే, ఉప్పెన సినిమా ఆ జైత్ర యాత్రని కొనసాగిస్తూ క్రాక్ ని మించిన హిట్ తో టాలీవుడ్ కి మంచి జోష్ ని ఇచ్చింది, తోలి సినిమా తోనే పంజా వైష్ణవ తేజ్ చాలా మంది స్టార్ హీరోలు కూడా సాధించని రికార్డులు సాధించి ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేసాడు, నిజానికి తోలి సినిమానే ఇంత పెద్ద విజయం సాధించడం అనేది వైష్ణవ తేజ్ అదృష్టం అనే చెప్పాలి, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం థియేటర్ లో ప్రేక్షకులను అలరిస్తూ కాసుల కానక వర్షం కురిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే బుల్లితెర పై అందుబాటులోకి రానుంది, ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం మీద డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, వాస్తవానికి ఈ సినిమాని డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేద్దాం అని అనుకున్నారు, కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహం తో ఈ సినిమాని థియేటర్స్ కి విడుదల చేసారు, దాని ఫలితం ఇది, అయితే ఈ సినిమా ని 60 రోజులు ధాటిని తర్వాత నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చెయ్యాలి అనేది డీల్, డీల్ కి తగ్గట్టు గానే ఈ సినిమా ని ఏప్రిల్ 6 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్నట్టు సమాచారం, ఇంతకాలం థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇక నుండి డిజిటల్ ప్లాటుఫారం లో కూడా అందుబాటులోకి రానుంది, కరోనా భయం తో థియేటర్స్ కి కదలని ఓవర్సీస్ ఆడియన్స్ ఉప్పెన ఓ టీ టీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు,మరి థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

ఇక ఉప్పెన సినిమా వసూళ్ల ట్రెండ్ ప్రస్తుతం ఎలా ఉంది అంటే మొదటి రోజు ఏకంగా ఈ సినిమా 9 కోట్ల 50 లక్షల రూపాయిలు షేర్ ని వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మీడియం రేంజ్ హీరోలలో ఈ స్థాయి కలెక్షన్లు అంటే మాములు విషయం కాదు,రెండవ రోజు 7 కోట్ల 30 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం,మూడవ రోజు అయితే ఏకంగా 8 కోట్ల రూపాయిల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 5 మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది,ఇలా అద్భుతమైన వీకెండ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నాల్గవ రోజు నుండి కూడా అదే స్థాయి వసూళ్లను కనబరుస్తూ మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి మీడియం బడ్జెట్ సినిమాలలో ఆల్ టైం ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్ సాధించిన చిత్రం గా చరిత్రకి ఎక్కింది,ఇక రెండవ వారం కూడా ఏకంగా 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం రెండు వారాలకు కలిపి ఏకంగా 49 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఫిబ్రవరి నెలలో విడుదల అయినా సినిమాల్లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రం గా చరిత్రకి, గతం లో ఫిబ్రవరి నెలలో విడుదల అయినా ప్రభాస్ మిర్చి సినిమా 48 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది,ఇప్పుడు ఇన్నేళ్లకు ఆ రేసీదు ని ఉప్పెన సినిమా బ్రేక్ చేసింది, ఇలా తోలి సినిమా తోనే సంచలనం విజయం అందుకొని డ్రీం డెబ్యూ సాధించిన హీరో గా చరిత్రకి ఎక్కాడు పంజా వైష్ణవ్ తేజ్.