నిహారిక పెళ్ళిలో వరుణ్ కి కాబోయే భార్య..ఆమె ఎవరో తెలుసా?

మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభోవం గా జరిగింది, బుధవారం రాత్రి 7.15 నిమిషాలకు మూడు మూళ్ళ బంధం తో నిహారిక చైతన్య ఒకటి అయ్యారు. మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీలు ఈ పెళ్ళిలో సందడి చేసారు అయితే ఇండస్ట్రీ కి సంబంధించి ఇద్దరే ఇద్దరు హీరోయిన్ లు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు అయితే వారిలో ఒక్కరు లావణ్య త్రిపాఠి మరొకరు రీతూ వర్మ వీళ్ల ఇద్దరు నిహారిక కి బెస్ట్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా పరిశ్రమలో నిహారిక ఎంటర్ అయిన సమయం లో లావణ్య మరియు రీతూ వర్మ ఇద్దరు సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు ఈ సమయం లో ఆమె మంచి ఫ్రెండ్ షిప్ చేసింది వీళ్ల ముగ్గురు మంచి పార్టనర్స్ అనే చెప్పాలి ఏదైనా పార్టీలకి వెళ్లిన వీళ్లు జిమ్ మేట్స్ కూడా వీళ్ల ముగ్గురు కలిసి వర్కౌట్స్ చేస్తూ బాగా క్లోజ్ అయ్యారు.

నిహారిక వేడుకకు రెండు రోజుల ముందే మెగా ఫ్యామిలీ తో పాటు చేరుకున్నారు, నిహారిక పెళ్లి సందర్బంగా లావణ్య త్రిపాఠి మెగా కోడలు కాబోతుంది అంటు రూమర్స్ వస్తున్నాయి. వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్,అంతరిక్షం సినిమాలో జోడి కట్టింది. మిస్టర్ సినిమా అపుడే వీరి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలు అయింది అంటు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత అంతరిక్షం సినిమాలో ఈ జోడి రిపీట్ కావడం తో వరుణ్ లావణ్య మధ్య బంధం బలపడింది అంటు గాసిప్స్ మొదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇలాంటి గాసిప్స్ వచ్చిన పెద్దగా ఆనాడు ఎవరు పాటించుకోలేదు కానీ ఇపుడు నిహారిక కూడా లావణ్య తో మంచి ఫ్రెండ్షిప్ చేయడం ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటడం పెళ్ళికి కూడా రెండు రోజుల ముందే రావడం తో మరింత ఆశక్తి అనేది మెగా అభిమానులకి కూడా కనిపిస్తుంది.

ఇదేమన్నా విశేషమా ఈ విషయాన్ని మాకు కూడా చెప్తే మేము ఇంక సంతోషిస్తాం అని అభిమానులు కూడా ఈ ఫొటోలతో కామెంట్స్ చేస్తున్నారు ఇంక నిహారిక పెళ్లి లో లావణ్య త్రిపాఠి సందడి చేస్తూ కనిపించింది ఇండస్ట్రీ లో ఇంతమంది హీరోయిన్లు ఉండగా లావణ్య కు స్పెషల్ ఇన్విటేషన్ ఏంటి వరుణ్ కి కాబోయే భార్య ఆమేనా అంటు రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి, అయితే నిహారిక పెళ్లి అయిన వెంటనే వరుణ్ కి కూడా పెళ్లి చేస్తారని ఇటీవలే తెలియ చేసారు నాగబాబు 2021 ముగింపు లో లేదా 2022 ప్రారంభం లో కానీ వరుణ్ తేజ్ కి పెళ్లి చేయాలనీ నిర్ణయించాము అని నాగబాబు తెలియ చేసారు.

లావణ్య ఇప్పటికే హీరోయిన్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తుమ్పు పొందింది. యాక్టర్ గా రాకముందు 2006 లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెల్చుకుంది. 2012 లో అందాల రాక్షసి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది చాలా సినిమాలో నటించారు హిట్స్ ఇచ్చారు, నాగబాబు కుమార్తె వివాహం తరువాత వచ్చే ఏడాది లో కచ్చితంగా వరుణ్ తేజ్ కి పెళ్లి చేస్తారని చెప్పారు అయితే ఇప్పటికే వరుణ్ కి పెళ్లి ఫిక్స్ చేసి ఉన్నారని అమ్మాయి ఎవరు అనేది సస్పెన్స్ ఉంచారని ప్రచారం వచ్చింది. ఇపుడు నిహారిక పెళ్ళిలో లావణ్య త్రిపాఠి సందడి తో ఈ రూమర్లకు బలం చేకూరుతుంది. అయితే మెగా ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం లావణ్య ఫ్రెండ్ మాత్రమే అని వరుణ్ తేజ్ తో ఎలాంటి రిలేషన్ లేదని ఇవ్వని పుకార్లు మాత్రమే అని కొట్టిపడేస్తున్నారు.