Vijay Deverakonda Kingdom Interesting Update – Latest Buzz

Vijay Deverakonda's Kingdom movie gets an exciting update! Check out the latest buzz, cast details, and release date. Don't miss this trending news.

Vijay Deverakonda Kingdom Interesting Update – Latest Buzz

టాలీవుడ్ యువ నటుల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యువతలో విశేషమైన క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిందే. తొలిసారిగా తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లిచూపులు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, అంతకముందు పలు సినిమాల్లో అడపాదడపా అక్కడక్కడా కొన్ని చిన్న పాత్రలు చేసారు. 

Vijay Deverakonda Kingdom Movie Release Date

అయితే పెళ్లిచూపులు మూవీలో తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత అర్జున్ రెడ్డి మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా తీసిన ఈమూవీలో షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. అనంతరం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ గీతా గోవిందం. 

రిలీజ్ అనంతరం అందరినీ విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆ మూవీస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ నటుడుగా మారిపోయిన విజయ్, అక్కడి నుండి మరిన్ని అవకాశాలు అందుకున్నారు. అయితే అవి ఆయనకు ఆశించిన స్థాయి విజయాలు అయితే అందించలేదు. 

Vijay Deverakonda’s Kingdom Movie Latest News

ఇటీవల డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఆయన చేసిన లైగర్ మూవీ ఫ్లాప్ అయింది. పాన్ ఇండియన్ రేంజ్ లో ఆ మూవీ రూపొందింది. అయితే దాని అనంతరం సమంత రూత్ ప్రభు తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించిన ఖుషి మూవీ మాత్రం మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మరొక్కసారి పరశురామ్ పెట్లతో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ నటించిన మూవీ ది ఫామిలీ స్టార్. 

అయితే ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తోన్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కింగ్‌డ‌మ్. ఈమూవీపై మొదటి నుండి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

మిస్టర్ బచ్చన్ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ యువ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర చేస్తున్నారు. యువ కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈమూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ అయి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ గ్లింప్స్ టీజర్ లో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఎంతో అదిరిపోయాయి. 

ఈమూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే గ్లింప్స్ టీజర్ రిలీజ్ అనంతరం కింగ్‌డ‌మ్ మూవీ పై అందరిలో ఒక్కసారిగా అంచనాలు తారా స్థాయికి చేరాయి. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ మూవీ మే 30న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

Kingdom Movie Cast, Release Date & Updates

కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ గురించి మ్యాడ్ స్క్వేర్ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా యువ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, కింగ్‌డ‌మ్ మూవీ గురించి ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించే మూవీ ఉంటుందని అన్నారు. ముఖ్యంగా గ్రాండియర్ విజువల్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని మరింతగా మెప్పిస్తుందని తెలిపారు. 

అలానే ఈ మూవీని కావాలని రెండు పార్ట్స్ గా తీయాలనుకోలేదని, కథ రీత్యా అది పక్కాగా రెండు పార్ట్స్ ఉంటాయని అన్నారు. అయితే ఫస్ట్ పార్ట్ పెద్ద విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన వంశీ, దాని ఫలితం అనంతరం సెకండ్ పార్ట్ యొక్క టైటిల్ అండ్ ఇతర డీటెయిల్స్ తెలియచేస్తాం అన్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow