Vishwambhara Release Date Update – Chiranjeevi’s Mega Movie Updates

Vishwambhara Release Date టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది

Vishwambhara Release Date Update – Chiranjeevi’s Mega Movie Updates

టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ మూవీలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా నటించగా దీనిని తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా తీశారు మెహర్ రమేష్. 

Vishwambhara Release Date Confirmed – Chiranjeevi’s Upcoming Movie

ఇక దాని అనంతరం తాజాగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు (Vishwambhara) మెగాస్టార్. ఈ మూవీలో అందాల కథానాయిక త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి, భీమవరం బుల్లబ్బాయి అనే పాత్ర చేస్తున్నారు. కాగా ఈ పాత్రతో మనకు కొన్నేళ్ల క్రితం ఆయన పోషించిన జగదేక వీరుడు అతిలోక సుందరి లోని రాజు పాత్ర గుర్తుకు వస్తుందని అంటున్నారు దర్శకుడు వశిష్ట. 

Vishwambhara Movie Story, Cast & Crew – Everything You Need to Know

ఇక ఆయన పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండడంతో పాటు మాస్ టచ్ తో పాటు ఎమోషనల్ గాను సాగుతుందట. కాగా విశ్వంభర మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సోషియో ఫాంటసీ గా రూపొందుతుండగా యువి క్రియేషన్స్ సంస్థ పై దీనిని వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న విశ్వంభర మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్ (Ashika Ranganath), సురభి, ఈషా చావ్లా, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. 

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. తప్పకుండా ఈ మూవీతో తమ అభిమాన మెగాస్టార్ పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని భావిస్తున్నారు మెగాఫ్యాన్స్. ఇక తాజాగా ఈమూవీలోని మంచి పార్టీ సాంగ్ షూట్ జరుగుతుండగా ఈ సాంగ్ లో మెగా  సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) చిన్న క్యామియో పాత్రల్లో కొద్దిసేపు కనిపించనున్నారట. 

Vishwambhara Shooting Updates & Production Status

ఇక ఈ సాంగ్ కోసం కీరవాణి అద్భుతమైన ట్యూన్ అందించారని దర్శకుడు వశిష్ట తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు. ఇక విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈమూవీని రానున్న మే 9న సమ్మర్ కానుకగా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 

Vishwambhara vs Other 2024 Big Releases – Box Office Clash?

అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అంత క్వాలిటీగా లేవని కొందరి నుండి నెగటివ్ ప్రచారం జరగడంతో సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విషయమై మరింత శ్రద్ధ పెట్టిన టీమ్ మరికొంత టైం తీసుకుని మెల్లగా అంతా ఓకే అయ్యాకనే రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారట. 

దాని ప్రకారం మే 9 మిస్ అయితే విశ్వంభర మూవీ జులై లో రిలీజ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అతి త్వరలో టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కానుందట. కాగా ఈ మూవీతో మెగాస్టార్ చిరంజీవి పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

Where to Watch Vishwambhara After Theatrical Release?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow