పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ తో సినిమా ఆ మాస్టర్ కల నెరవేరుతుందా…?

మన ఫిలిం ఇండస్ట్రీ లో కొరియోగ్రాఫర్స్ కు దర్శకులు గా మారడం కొత్త ఏమి కాదు మనకి ఎంతో ప్రసిద్ధ చెందిన లారెన్స్, అమ్మ రాజశేఖర్, ప్రభుదేవా వంటి ప్రముఖులు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మంది కొరియోగ్రాఫర్స్ విజయం సాధించారు. అయితే టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగిన జానీ మాస్టర్ కూడా దర్శకుడిగా మారుతున్నాడు అనే విష్యం 3 ఏళ్ళ అప్పటినుండి ఈ టాక్ వినిపిస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్ డైరెక్షన్ లో చేయబోతున్నారని 2017 లో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి జానీ మాస్టర్ వీర అభిమాని పవన్ కళ్యాణ్ పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందించారు అయితే పవన్ కళ్యాణ్ తో డైరెక్షన్ చేయాలనీ ఉంది ఇప్పటికే అయిన తో సినిమా చేసారని గతం లో ఒక ఇంటర్వ్యూ లో జానీ మాస్టర్ చెప్పారు అప్పటినుండి ఇప్పటిదాకా వార్తలు వస్తూనే ఉన్నాయ్,తాజాగా మరోసారి ఈ టాపిక్ తేరా పైకి వచ్చింది ఈ సారి ఒక అడుగు ముందుకు కదిలింది జానీ మాస్టర్ కి అంగీకరించారు అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

జానీ మాస్టర్ గారి అసలీ పేరు జానీ బాషా తను తెలుగు ,హిందీ,తమిళ్ ,కన్నడ భాషలో కూడా డాన్స్ కొరియోగ్రాఫ్ చేసారు అతను ఎక్కువగా ఫోక్,వెస్ట్రన్ డాన్స్ మీద కొరియోగ్రాఫర్స్ చేసారు,ఢీ డాన్స్ షో లో షోస్ చేసారు అలానే నీతోనే డాన్స్ షో కి జబర్దస్త్ లో జడ్జి గా మరియు స రి గా మా ప కి గెస్ట్ రోల్ లో వెళ్లారు. ద్రోణ సినిమాలో మొదటి సరి కొరియోగ్రాఫ్ చేసారు. రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో చేసాక తనకి నచ్చి రామ్ చరణ్ అన్ని చిత్రాల్లో నియమించాడు మరియు రామ్ చరణ్ కోసం స్పెషల్ పాటను అంకితం చేసాడు . పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్,ఎన్టీఆర్,రామ్ పోతినేని,రవి తేజ సినిమాలో చేసారు.

టాలీవుడ్ లో నే కాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి జై హోం సాంగ్ చేసారు బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు, సినీ మా అవార్డు గెలిచారు. బెస్ట్ పాపులర్ హిట్ సాంగ్ రౌడీ బేబీ సాంగ్ సెన్సషనల్ గా వైరల్ హిట్ గా నిలిచింది. అలా వైకుంఠపురం లో బుట్ట బొమ్మ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది రోలింగ్ స్టెప్ చాలా ఫేమస్ అయింది. ఈ పాట వరల్డ్ వైడ్ లో విజయాన్ని సాధించింది చాలా మంది సెలబ్రిటీస్ ఈ సాంగ్ తో పెర్ఫార్మన్స్ చేసి సోషల్ మీడియా లో ట్రెండ్ చేసారు.

పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను రెడీ చేసారని జానీ మాస్టర్ ఆ స్టోరీ విని పవన్ కళ్యాణ్ ఒపుకున్నారట,ఇండస్ట్రీ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒప్పుకోడం తో యాక్టర్ రామ్ చరణ్ కి కూడా ఈ స్టోరీ చెప్పారు చరణ్ కి కూడా నచ్చడం తో అయిన స్వయం గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించాలని జానీ మాస్టర్ కు హామీ ఇచ్చారట ఈ రూమర్స్ లో నిజం ఎంతో తెలీదు కానీ న్యూస్ తెల్సిన వాళ్లకి మాత్రం చాలా ఆశక్తికరంగా ఉంది నిజం ఎంతో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వరస ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్న వకీల్ సాబ్ రిలీజ్ అవుతుంది సంక్రాతి కానుక గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు ఇదే కాకుండా క్రిష్,హరీష్ శంకర్, సాగర్ చంద్ర దర్శకత్వం తో వరుస సినిమాలు చేయాలనీ అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలని పూర్తీ చేసాక జానీ మాస్టర్ దర్శకత్వం లో స్టార్ట్ చేస్తారు అని వార్తలు వినిపించాయి.