Thandel Box Office Collection Worldwide – Day-Wise Earnings & Total Business Report

Thandel Box Office Collection Worldwide తెలుగు యువ నటుడు అక్కినేని వారి మూడవ తరం వారసుల్లో ఒకరైన యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీలో

Thandel Box Office Collection Worldwide – Day-Wise Earnings & Total Business Report

తెలుగు యువ నటుడు అక్కినేని వారి మూడవ తరం వారసుల్లో ఒకరైన యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీలో యువ అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు. 

Thandel Box Office Collection Worldwide – Total Earnings Report

యువ నిర్మాత బన్నీ వాసు ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మించగా కీలక పాత్రల్లో బబ్లు పృథ్వీరాజ్, కరుణాకరన్, దివ్య పిళ్ళై, ఆడుకాలం నరేన్, కల్పలత, ప్రకాష్ బేలవాడి తదితరులు నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చి మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. 

Thandel Day-Wise Box Office Collection – India & Overseas

ముఖ్యంగా తండేల్ ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా హృద్యమైన ఎమోషనల్ లవ్ డ్రామాగా మూవీ ఆకట్టుకుందని రివ్యూ ఇచ్చారు. మరోవైపు మొదటి రోజు మొదటి ఆట నుండి అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మూవీకి మంచి ఆదరణ, టాక్ ని అందించారు. ముఖ్యంగా మూవీలో రాజు గా నాగ చైతన్య, సత్య గా సాయి పల్లవిల నటన అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు పలు లవ్, ఎమోషనల్ సీన్స్ లో వారి నటన అందరి మదిని తాకుతోంది. 

Thandel Movie Budget & Break-Even Target

ఆ విధంగా సహజత్వ నటనతో వారిద్దరూ ఆయా పాత్రలకు జీవం పోశారు. ఇక దర్శకుడు చందూ మొండేటి కూడా మూవీని ఎక్కడా కూడా ప్రక్క దారి పట్టించుకుండా చెప్పదల్చుకున్న పాయింట్ ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. వీటితో పాటు ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్, మరీ ముఖ్యంగా రాక్ స్టార్ దేవి అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి మూవీకి వెన్నెముకగా నిలిచాయి అని చెప్పాలి. 

మొత్తంగా అందరి నుండి మంచి క్రేజ్ తో పాటు పలు ఏరియాల్లో బాగానే కలెక్షన్ తో ప్రస్తుతం కొనసాగుతోంది తండేల్ మూవీ. ఇక ఈ మూవీ ఫస్ట్ డే రూ. 20.45 కోట్లు, రెండవ రోజు రూ. 16.05 కోట్లు, మూడవరోజు 17.60 కోట్లు, నాలుగవ రోజు రూ. 6.15 కోట్లు, ఐదవ రోజు రూ. 5.40 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 65.70 కోట్లు, అలానే ఆరు రోజులకు గాను రూ. 81 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని అతి త్వరలో రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువ అవుతోంది. 

Thandel’s Performance in Telugu States vs Other Markets

ఇప్పటికే బ్రేకీవెన్ కి చేరువైన తండేల్ మూవీ అమెరికాలో మాత్రం ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసి ఉంటె బాగుందేది. అక్కడ ఆశించిన స్థాయి రెస్పాన్స్ రావడం లేదని అంటున్నారు పలువురు డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఓవర్సీస్ లో మొత్తంగా 1 మిలియన్ కి చేరువవుతోంది. మొత్తంగా తండేల్ మూవీ నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలవడంతో పాటు కెరీర్ పరంగా ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం, క్రేజ్ పెంచడం జరిగింది.

Will Thandel Enter the ₹100 Crore Club? Trade Experts Predict

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow