Allu Aravind’s Interesting Comments on Ram Charan – Fans React
Allu Aravind Interesting Comments on Ram Charan టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధినేత, అలానే ఒక్కటి దిగ్గజ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ పేరు ప్రత్యేకంగా మన తెలుగు వారికి పరిచయం అవసరం

టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధినేత, అలానే ఒక్కటి దిగ్గజ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ పేరు ప్రత్యేకంగా మన తెలుగు వారికి పరిచయం అవసరం లేనిది. తన బావ మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో ఏళ్ళ అనుబంధం కలిగిన అరవింద్ మొదటి నుండి కూడా ఆయనతోనే నడుస్తున్నారు.
Allu Aravind’s Latest Comments on Ram Charan Go Viral
ఇక మెగాస్టార్ తో పాటు తమ కుటుంబంలోని చరణ్, పవన్, అల్లు అర్జున్ లతో తన గీతా ఆర్ట్స్ సంస్థ పై పలు సినిమాలు నిర్మించి భారీ విజయాలు అందుకున్న అల్లు అరవింద్ పలువురు ఇతర నటులతో కూడా సినిమాలు నిర్మించి విజయాలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది.
ఇక తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తో ఆయన సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. చండీఓ మొండేటి తీసిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి భారీ విజయం దిశగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.
What Did Allu Aravind Say About Ram Charan?
అయితే ఆ మూవీ యొక్క ఇటీవలి ఒక ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం అలానే గేమ్ ఛేంజర్ మూవీస్ గురించి చేసిన అల్లు అరవింద్ వ్యాఖ్యలు ఒకింత తమ హీరో మూవీని తగ్గించినట్లు అనిపించాయని పలువురు మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయి సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేసారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని పైకి లేపి గేమ్ ఛేంజర్ ని అరవింద్ తగ్గించేలా మాట్లాడారనేది వారి ప్రధాన ఆరోపణ.
Ram Charan & Allu Aravind’s Bond – Family & Professional Relationship
అనంతరం మరొక ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, రామ్ చరణ్ నటించిన ఫస్ట్ మూవీ చిరుత కేవలం యావరేజ్ గా మాత్రమే ఆడిందని, అనంతరం తన మేనల్లుడికి ఎలాగైనా భారీ సక్సెస్ అందించాలనే ఉద్దేశ్యంతోనే తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అతడి సెకండ్ మూవీ అయిన మగధీర ని దర్శకుడు రాజమౌళి తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం అని అన్నారు. అనంతరం అది పెద్ద విజయం అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని అందించిందని తెలిపారు అరవింద్.
అయితే అప్పట్లో రామ్ చరణ్ నటించిన డెబ్యూ మూవీ చిరుత మంచి విజయవంతం అయితే అరవింద్ కావాలనే దానిని యావరేజ్ అంటున్నారు అనేది కూడా మెగా ఫ్యాన్స్ ఆరోపణ. మొత్తంగా అయితే తాజాగా జరిగిన తండేల్ సక్సెస్ మీట్ లో భాగంగా ఈ వ్యాఖ్యల పై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.
Fans’ Reactions to Allu Aravind’s Statement on Ram Charan
నిజానికి తనకు రామ్ చరణ్ కొడుకు వంటి వాడని తన కుమారులు అలానే చరణ్ అందరూ కలిసే పెరిగారని అన్నారు. దిల్ రాజు ని అడ్డంపెట్టుకుని తానేదో గేమ్ ఛేంజర్ మూవీని తగ్గించాను అనేది మెగా ఫ్యాన్స్ భావన అని, అయితే తనకు అటువంటి ఉద్దేశ్యం ఏమాత్రం లేదన్నారు. దయచేసి ఎవరూ తప్పుగా ఆలోచించవద్దు, చరణ్ మరిన్ని మంచి సినిమాలు చేసి కెరీర్ పరంగా మరింత ఉన్నత శిఖరాలు చేరాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. ఇక త్వరలో తమ సంస్థ నుండి మరిన్ని మంచి చిత్రాలు చేసి ఆడియన్స్ ని అలరించలనేది తన కోరిక అన్నారు అల్లు అరవింద్.
What’s Next for Ram Charan? Upcoming Movies & Projects
What's Your Reaction?






