Anushka Shetty Height, Weight, Age, Biography & More
Anushka Shetty's height, weight, age, and biography details. Get complete information about the popular Telugu actress, her career, and latest updates.

తెలుగు సినిమా పరిశ్రమలోని లేటెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన అనుష్క శెట్టి కూడా ఒకరు. నటిగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ తో ఎందరో ఫ్యాన్స్ ఆడియన్స్ మనసుల్లో మంచి స్థానం సంపాదించి కొనసాగుతున్నారు అనుష్క శెట్టి.
Anushka Shetty Height, Weight, Age & Personal Details
స్వతహాగా బెంగళూరుకి చెందిన అనుష్క శెట్టి మొదట్లో యోగా శిక్షకురాలిగా హీరోయిన్ భూమిక భర్త అయిన భరత్ ఠాకూర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆమె తల్లితండ్రులు ప్రఫుల్ల, విట్టల్ శెట్టి, కాగా అనుష్క కి ఇద్దరు సోదరులు. వారి పేర్లు గుణరాంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. 7 నవంబర్ 1981న కర్ణాటకలోని మంగళూరులో అనుష్క శెట్టి జన్మించారు.
తన విద్యాభ్యాసం అనంతరం బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ఆమె బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అక్కడి నుండి అనుకోకుండా 2005లో కింగ్ నాగార్జున హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన సూపర్ మూవీలో ఒక హీరోయిన్ గా తొలి ఛాన్స్ సొంతం చేసుకున్నారు. ఆ మూవీలో బాలీవుడ్ నటి అయేషా టాకియా కింగ్ నాగార్జున కి జోడీగా నటించగా సోను సుధ సోదరిగా అనుష్క నటించారు.
అప్పట్లో మంచి క్రేజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సూపర్ మూవీ యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తరువాత నుండి తన ఆకట్టుకునే అందం, అభినయంతో మంచి పేరుతో మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు సొంతం చేసుకున్నారు అనుష్క. సుమంత్, శ్రీహరి కలయికలో రూపొందిన మహానంది, మంచు విష్ణుతో అస్త్రం, ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ తో ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు అనుష్క.
ఆ తరువాత ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసారు అనుష్క శెట్టి. అక్కడి నుండి మరిన్ని అవకాశాలు అందుకున్న అనుష్క శెట్టి కి అదే సమయంలో దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన అరుంధతి మూవీ సబ్జెక్ట్ నచ్చింది.
Anushka Shetty Biography & Career Highlights
అయినప్పటికీ అంతటి పవర్ఫుల్ పాత్రలో తాను సరిపోతానో లేదో అని ఒకింత నో చెప్పారట అనుష్క. అయితే ఆ తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణ ఆమెకు అన్ని విధాలుగా సపోర్ట్ అందించి ఫైనల్ గా అరుంధతి మూవీ తెరకెక్కించారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్పట్లో భారీ వ్యయంతో రూపొందిన ఆ మూవీ 2009లో రిలీజ్ అయి అతిపెద్ద విజయం సొంతం చేసుకుంది.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ విలన్ గా చేసిన ఆ మూవీలో జేజమ్మ గా అరుంధతిగా అనుష్క శెట్టి పవర్ఫుల్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా నీరాజనాలు పట్టారు. ఆ మూవీ హర్రర్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇక అక్కడి నుండి నటిగా అనుష్క కెరీర్ మరింతగా ఊపందుకుంది.
కాగా తన కెరీర్ లో టాలీవుడ్ స్టార్ హీరోలైన నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి వారితో పలు సినిమాలు చేసారు అనుష్క. వాటితో పాటు అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన అవకాశాలు అందుకుని నటిగా ఎంతో క్రేజ్ తో ఆమె దూసుకెళ్లారు.
అదే సమయంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ కలయికలో క్రిష్ జాగర్లమూడి తీసిన వేదం మూవీలో అనుష్క పోషించిన వేశ్య పాత్రకు మంచి పేరు లభించింది అలానే సైజ్ జీరో, వర్ణ వంటి విభిన్న చిత్రాల్లో కూడా నటించి ఆమె తన నటనతో మెప్పించారు. కాగా 2015లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ బాహుబలి 1లో నటించి దానితో పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు.
Anushka Shetty Movies, Awards & Latest News
అనంతరం 2017లో దానికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల పైచిలుకు కలెక్షన్ సొంతం చేసుకుని హీరోయిన్ గా అనుష్క రేంజ్ మరింత పెంచింది. ఆ మూవీస్ లో ఆమె దేవసేన పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు అనుష్క శెట్టి. ఆ తరువాత భాగమతి, రుద్రమదేవి, నిశ్శబ్దం వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాలు అందుకున్నారు.
ఇటీవల టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి తో కలిసి అనుష్క శెట్టి నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ మంచి విజయం అందుకుని నటిగా అనుష్క కెరీర్ కి ఇటీవల బ్రేక్ ని అందించింది. ఇక తాజగా హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఘాటీ మూవీ చేస్తున్నారు అనుష్క.
ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లో మునుపెన్నడూ కనిపించని ఒక పవర్ఫుల్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు అనుష్క. దానితో పాటు మలయాళంలో రూపొందుతోన్న భారీ మూవీ కథనార్ ది వైల్డ్ సోర్సెరర్ సినిమాలు చేస్తున్నారు అనుష్క.
ఇక మొదటి నుండి కెరీర్ పరంగా తనకు లభించే పారితోషికంగా కొంత గుప్తదానాలు చేసే అనుష్క శెట్టి, కష్టంతో ఇష్టపడి పని చేసే ఎప్పటికైనా విజయం తథ్యం అంటారు. ఇకపై ఆడియన్స్ ని మరింతగా మంచి పాత్రలతో ఆకట్టుకోవాలనేది తన కోరిక అని అంటారు ఆమె. మరి నటిగా అనుష్క శెట్టి రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
What's Your Reaction?






