Boycott Laila Twitter Trending Issue
Boycott Laila Twitter Trending తెలుగు నటుడు విశ్వక్సేన్ కొన్నాళ్ల క్రితం మెకానిక్ రాక్ అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. అయితే

తెలుగు నటుడు విశ్వక్సేన్ కొన్నాళ్ల క్రితం మెకానిక్ రాక్ అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. అయితే ఆ మూవీ అనంతరం తాజాగా లైలా అనే రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విశ్వక్. ఈమూవీ ద్వారా తొలిసారిగా ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు.
సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకమైనది అని, అందుకే ఆ పాత్ర చేశాను, దాని కోసం చాలానే కష్టపడవలసి వచ్చిందని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలిపారు విశ్వక్ సేన్. ఈ మూవీని యువ దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నాగినీడు, రవి మరియా, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల లైలా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకుని ఆ పైన బయటకు వచ్చిన గ్లింప్స్ టీజర్ అలానే ట్రైలర్ తో పాటు సాంగ్స్
ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి.
ఇక ఇటీవల ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగగా మెగాస్టార్ చిరంజీవి దానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి టీమ్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపి ఆశీర్వదించారు. అయితే విషయం ఏమిటంటే, ఆ ఈవెంట్ లో ప్రముఖ సీనియర్ నటుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
ఆయన మాట్లాడిన మాటలు ఒక ప్రముఖ పార్టీ ని పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు మాదిరిగా ఉన్నాయని పలువురు ఆ పార్టీకి సంబందించిన వారు మీడియా మాధ్యమాల ద్వారా సదరు ఆ నటుడి పై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతే కాదు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో లైలాకు వ్యతిరేకంగా బాయ్ కాట్ లైలా మూవీ అంటూ దాదాపుగా లక్షకు పైగా ట్వీట్స్ చేసి ఆ మూవీని టార్గెట్ చేసారు.
అయితే ఈ ఘటనతో సదరు నటుడికి వందల్లో పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందుచేత ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో కూడా చేరడం జరిగిందనేది తెలిసిందే. ఈ విషయమై హాస్పిటల్ నుండి ఆ నటుడు మాట్లాడుతూ, తాను నిజానికి ఆ వ్యాఖ్యలు ఏ పార్టీని ఉద్దేశించి చేయలేదని, సందర్భానుసారం సినిమాలో జరిగిన ఘటనని ఉద్దేశించి చెప్పాను అంతే అని అన్నారు.
దాని వలన తన ఫ్యామిలీని తనని టార్గెట్ చేసి ఆ పార్టీ వారు ఫోన్స్ తో తనని వేధిస్తున్నారని, ఆ విషయమై పోలీసులకు కంప్లైట్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఆ పార్టీ వారు కూడా మాట్లాడుతూ, తాము కూడా తగలేదని అంటున్నారు. ఇక నిన్న జరిగిన లైలా ప్రత్యేక ప్రెస్ మీట్ లో భాగంగా నటుడు విశ్వక్సేన్, నిర్మాత సాహు మాట్లాడుతూ, ఆ సీనియర్ నటుడు మాట్లాడుతున్న సమయంలో తాము స్టేజి మీద లేమని, అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తెలిసి ఆయనని ప్రత్యేకంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు.
ఒకవేళ తాము కనుక ఆ వ్యాఖ్యల సమయంలో అక్కడే ఉండి ఉంటె తప్పకుండా ఆ నటుడిని వారించి ఉండేవారం అని అన్నారు. ఇక విశ్వక్సేన్ మాట్లాడుతూ, నిజానికి ఇది కావాలని చేసింది కాదని, అయితే తన లైలా సినిమా ఈవెంట్ లో జరిగింది కాబట్టి తాను ప్రత్యేకంగా ఆ పార్ట వారికి క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు.
సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం అన్ని, ఒక్కరు చేసిన తప్పుకు సినిమాని శిక్షిస్తాం, బాయ్ కాట్ చేస్తాం అని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నిర్మాత సాహు మాట్లాడుతూ, తామందరం లైలా కోసం ఎంతో శ్రమ పడ్డాం అని, ప్రత్యేకంగా లైలా పాత్ర కోసం విశ్వక్ ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారని తెలిపారు.
అందుకే ఈ ఘటనని ఇప్పటికైనా వదిలేయాలని, అలానే ప్రతి ఒక్కరు తప్పకుండా మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసి తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. మతంగా అయితే అటు హీరో ఇటు నిర్మాత మాట్లాడి, మరోవైపు హీరో క్షమాపణ చెప్పినప్పటికీ కూడా లైలా మూవీ అంశం మాత్రం ప్రస్తుతం ఇంకాగా ఆగినట్లు కనపడడం లేదని అంటున్నాయి సినీ వర్గాలు.
ఇంకా ఈ మూవీ పై నెగటివ్ ట్వీట్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయని, మరి ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్న లైలా ఎంతవరకు విజయం అందుకుంటుందో చూడాలి. అయితే మేము లైలాని సపోర్ట్ చేస్తున్నాం అంటూ మరికొందరు పాజిటివ్ గా కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ మూవీకి తమ మద్దతు తెలుపుతున్నారు. కాగా లైలా మూవీతో నటుడిగా విశ్వక్ మరొక చక్కని విజయం సొంతం చేసుకుని విజయబావుటా ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
What's Your Reaction?






