Kannappa Teaser Review : Vishnu Manchu’s Magnum Opus Impresses Fans

Kannappa teaser review featuring Vishnu Manchu in a grand mythological drama. Explore VFX, storyline, cast, and fan reactions. Watch the teaser now!

Kannappa Teaser Review : Vishnu Manchu’s Magnum Opus Impresses Fans

మంచు విష్ణు హీరోగా తాజగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప. ఈ మూవీపై మొదటి నుండి ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

Kannappa Teaser Review – A Spectacular Mythological Drama

ఈ మూవీని హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా తన సొంతం సంస్థలైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్ పై మంచు విష్ణు గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నారు. 

ఖర్చు విషయంలో అలానే టెక్నీకల్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తాము కన్నప్ప మూవీని నిర్మిస్తున్నట్లు పలు మార్లు విష్ణు చెప్పుకొచ్చారు. 

Vishnu Manchu’s Powerful Performance & Star Cast

ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు, ఆ తరువాత రిలీజ్ అయిన కీలక పాత్రధారుల యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్, అలానే ఫిస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల కన్నప్ప నుండి స్టీఫెన్ దేవసి కంపోజ్ చేసిన శివ శివ శంకర సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని యూట్యూబ్ లో బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

ఇక తాజగా ఈ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాగా టీజర్ లో కన్నప్పగా నటిస్తున్న మంచు విష్ణు తో పాటు రుద్ర గా నటిస్తున్న ప్రభాస్, అలానే ఇతర ముఖ్య పాత్రధారులని కొన్ని క్షణాల పాటు చూపించారు. ముఖ్యంగా టీజర్ లో భారీ స్థాయి విజువల్స్, డైలాగ్స్, హై టెక్నీకల్ వేల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. 

Visual Effects & Cinematic Excellence – A Game Changer?

ముఖ్యంగా టీజర్ లో తిన్నడు గా మంచు విష్ణు, రుద్ర గా ప్రభాస్ తో పాటు మహాదేవ శాస్త్రిగా నటిస్తున్న మోహన్ బాబు లుక్స్ బాగున్నాయి. అలానే ఈ టీజర్ మొత్తంగా ఇప్పటివరకు కన్నప్ప పై ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసిందని చెప్పాలి. ఇక ఈ మూవీని ఇటీవల విదేశాల్లోని పలు గ్రాండియర్ లొకేషన్స్ లో ఎంతో ఖర్చు పెట్టి చిత్రికరించారు. 

Kannappa Movie Release Date & Expectations

ఏప్రిల్ 25న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న కన్నప్ప మూవీకి షెల్డన్ చావ్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. కాగా ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని భారీ ధరకు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది. 

ఇక ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ అందాల నటి కాజల్ అగర్వాల్ క్యామియో పాత్రలు చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్ బాబుతో పాటు ఐశ్వర్య, శరత్ కుమార్, కరుణాస్, బ్రహ్మానందం, రఘు బాబు, ముకేశ్ ఋషి, మధుబాల, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. 

Final Verdict – Is Kannappa a Blockbuster in the Making?

తప్పకుండా తామందరి కష్టానికి తగ్గ ఫలితాన్ని రేపు రిలీజ్ అనంతరం ఆడియన్స్ అందిస్తారని ఆశాభావాన్ని కన్నప్ప టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గతంలో మైథలాజికల్ ఎపిక్ మహాభారతం టెలివిజన్ సిరీస్ ని గ్రాండ్ గా తెరకెక్కించి మంచి పేరు అందుకున్న దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow