Latest Tollywood News and Gossip – Breaking Updates & Celeb Rumors
Latest Tollywood News and Gossips Today టాలీవుడ్ సినిమా ప్రస్తుతం రోజు రోజుకు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. 2015లో జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి 1, ఆ తరువాత 2017లో తీసిన బాహుబలి 2

టాలీవుడ్ సినిమా ప్రస్తుతం రోజు రోజుకు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. 2015లో జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి 1, ఆ తరువాత 2017లో తీసిన బాహుబలి 2 సినిమాలు రెండూ కూడా ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ కీర్తి దేశం మొత్తం వినిపించేలా చేసాయి. అలానే అనేక ఇతర దేశాల్లో సైతం బాహుబలి సిరీస్ సినిమాలు విజయకేతనం ఎగురవేశాయి.
ఆ తరువాత వచ్చిన ఆర్ఆర్ఆర్, సలార్, పుష్ప, దేవర, కల్కి 2898 ఏడి మూవీస్ మరింత గొప్ప విజయాలు సొంతం చేసుకుని తెలుగు సినిమాకి వరల్డ్ ఆడియన్స్ లో మరింత గొప్ప క్రేజ్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రపంచం మొత్తం కూడా తెలుగు వారిపై చూడడం మరింతగా పెరిగింది. ఇక నేటి టాలీవుడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం
SSMB 29
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీయనున్న ఈ మూవీ పై గ్లోబల్ ఆడియన్స్ లో విశేషమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ తమ దుర్గ ఆర్ట్స్ సంస్థ పై నిర్మించనున్నారు.
ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే బల్క్ గా బాడీతో పాటు మీసం గడ్డం కూడా పెంచుతున్నారు. దాదాపుగా వెయ్యి కోట్ల భారీ వ్యయంతో అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోండగా మూవీని 2025 జనవరిలో షూట్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలానే ఇండియా తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించనున్నట్టు టాక్.
Latest Tollywood News and Gossip – Trending Updates & Insider Talk
పుష్ప 2 ది రూల్ : Pushpa 2 The Rule
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల మూడేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్న పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప 2 పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఈ మూవీని డిసెంబర్ 5న అర్ధరాత్రి బెనిఫిట్ షోస్ ని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే పుష్ప 2 నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
గేమ్ ఛేంజర్ : Game Changer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్.
ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ మూవీని భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మూడవ సాంగ్ ని నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.
Tollywood Movie Announcements & Big Budget Films
డాకు మహారాజ్ : Daaku Maharaaj
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మాస యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్ర పోషిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది.
ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా డాకు మహారాజ్ పై భారీ అంచనాలు ఏర్పరిచింది ఈ గ్లింప్స్ టీజర్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న ఈమూవీలో బాలకృష్ణ సరసన ముగ్గురు అందాల భామలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 12న గ్రాండ్ గా అన్ని కార్యక్రమాలు ముగించి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక డాకు మహారాజ్ నుండి ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.
Telugu Film Industry Celebrities – Latest Controversies & Rumors
Tollywood Box Office Updates – Recent Hits & Flops
సంక్రాంతికి వస్తున్నాం : Sankranthiki Vasthunnam
ఈ ఏడాది యువ దర్శకుడు శైలేష్ కొలను తీసిన సైంధవ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు విక్టరీ వెంకటేష్. ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా మూవీ మాత్రం యావరేజ్ విజయం అందుకుంది. ఇక తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. గతంలో ఆయనతో వెంకీ చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్నాయి.
యువ అందాల నటీమణులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఈమూవీ లో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్ట రమణ గోగుల ఒక సాంగ్ ని పాడుతున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు. త్వరలో సంక్రాంతికి వస్తున్నాం యొక్క ప్రమోషన్స్ ని ప్రారంభించనుంది టీమ్.
Upcoming Telugu Movies & Release Date Updates
What's Your Reaction?






