HIT 3 Trailer Out Now: Nani Returns with Another Action Thriller
Watch the official HIT 3 trailer starring Nani. A gripping Telugu thriller continues with new twists and action. Full details here.

నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ హిట్ 3 ట్రైలర్ ప్రస్తుతం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో పవర్ఫుల్ యాక్షన్, ఇంటెన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా నాని ఈ ట్రైలర్ లో తన మార్క్ డిఫరెంట్ స్టైల్ మాడ్యులేషన్ యాక్టింగ్ తో అదరగొట్టారు అని చెప్పాలి. ముఖ్యంగా హిట్ సిరీస్ ఫ్రాంఛైజ్ నుండి వచ్చిన గత రెండు సినిమాల కంటే మించేలా మరింత గ్రాండ్ యాక్షన్ అంశాలు ఇందులో పొందుపరిచినట్లు హిట్ 3 ట్రైలర్ చూస్తే మనకు అర్ధం అవుతుంది.
హిట్ 3 ట్రైలర్ రిలీజ్ – నాని మరోసారి ధమాకా
కెజిఎఫ్ సిరీస్ సినిమాల అందాల హీరోయిన్ శ్రీదిని శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తుండగా యువ దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. జనాలకి అర్జున్ మృగాలకి సర్కార్ అంటూ తన పేరు విషయమై హీరోయిన్ అడిగిన ప్రశ్నకు పవర్ఫుల్ గా నాని సమాధానం ఇచ్చే డైలాగ్ ట్రైలర్ లో అదిరిపోయిది.
ఇక మిక్కీ జె మేయర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సను జాన్ వర్గేసే విజువల్స్ కూడా బాగున్నాయి. కొంత ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీ ఒకింత వయొలెంట్ గానే అనిపిస్తుంది. అందుకే ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ వారు ఏ సర్టిఫికెట్ ని అందించారు. ఇందులో నాని యాక్షన్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ అంశాలు అందరినీ ఆకట్టుకుంటాయని హిట్ 3 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా టీమ్ చెప్తోంది.
హిట్ 3 కథలోని ట్విస్ట్ – ట్రైలర్ హైలైట్స్
ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ శ్రీనిధి క్యారెక్టర్ కూడా బాగుంటుందని, టీమ్ మొత్తం కూడా సినిమా యొక్క క్వాలిటీ ఔట్పుట్ కోసం ఎంతో ఎంతో కష్టపడ్డారని అన్నారు నాని. యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మాత ప్రశాంతి తిపిర్నేనితో కలిసి తన వాల్ పోస్టర్ సినిమా సంస్థ పై నాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఈ మూవీ బాగానే రాబట్టినట్లు చెప్తున్నారు. అలానే హిట్ 3 ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. ఇటీవల వరుసగా విజయాలతో కొనసాగుతున్నారు నాని. ప్రియాంక మోహన్ కథానాయికగా ఇటీవల వివేక్ ఆత్రేయ తీసిన సరిపోదా శనివారం మూవీతో పెద్ద విజయం అందుకున్నారు నాని.
హిట్ 3 సినిమా విడుదల తేదీ, నటీనటులు, ఆసక్తికర విషయాలు
అలానే అంతకముందు కూడా విజయాల బాటలో కొనసాగుతున్న ఆయన కెరీర్ కి ఈ మూవీ మరొక విజయాన్ని తప్పకుండా అందిస్తుందని, పలు సీన్స్ లో థియేటర్స్ లో నాని యాక్టింగ్ కి గూస్ బంప్స్ ఖాయం అని టాక్. ఇక ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతూ అందరినీ ఆకట్టుకుంటూ మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది.
అలానే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్ తో పాటు రెండు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు ముగించి హిట్ 3 మూవీని గ్రాండ్ గా మే 1న భారీస్థాయి లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి ఈ మూవీ ద్వారా నాని ఏస్థాయిలో మెప్పించి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
What's Your Reaction?






