Sreeleela Bollywood Debut with Aashiqui 3? Latest Updates & Rumors
Sreeleela Bollywood Debut with Aashiqui 3 టాలీవుడ్ యువ అందాల కథానాయికల్లో ఒకరు శ్రీలీల (Sreeleela). సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందడి మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు

టాలీవుడ్ యువ అందాల కథానాయికల్లో ఒకరు శ్రీలీల (Sreeleela). సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందడి మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ మూవీకి కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు.
Sreeleela’s Bollywood Debut – Is She the Lead Actress in Aashiqui 3?
అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం అందుకోవడంతో పాటు తొలి చిత్రంతోనే హీరోయిన్ గా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరి మనసులు దోచారు శ్రీలీల. ఈ మూవీ అనంతరం ఆమెకు ఒక్కొక్కటిగా అవకాశాలు రాసాగాయి. అనంతరం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుని దానితో పెద్ద విజయం అందుకున్నారు.
ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన స్కంద మూవీలో కూడా హీరోయిన్ గా నటించారు శ్రీలీల. ఇక ఇటీవల యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరిలో కీలక పాత్ర చేశారు.
Sreeleela in Aashiqui 3? What We Know So Far
ఆ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుని నటిగా శ్రీలీలకు మరింత మంచి పేరు తీసుకువచ్చింది. ఆపైన యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీస్ చేసి ఆమె అలరించారు. అనంతరం టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తీసిన రూపొందిన గుంటూరు కారం మూవీ చేసి దానితో కూడా విజయం అందుకున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ బిగ్గెస్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 లో ఒక స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఆమె మొత్తంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి నితిన్ హీరోగా వెంకీ కుడుముల తీస్తున్న రాబిన్ హుడ్ తో పాటు తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా నటిస్తున్నారు.
Sreeleela’s Journey from South to Bollywood – Aashiqui 3 Entry
అలానే అటు తమిళ్ లో సుధా కొంగర దర్శకత్వంలో యువ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, త్వరలో శ్రీలీల హిందీ మూవీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ని ఆమె కలిసారని, ఆయన బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఆమె అక్కడ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు ఇటీవల వచ్చాయి.
Official Announcement on Sreeleela’s Role in Aashiqui 3
అలానే ప్రముఖ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ నటించనున్న మూవీ ద్వారా ఆమె బాలీవడో ఎంట్రీ కన్ఫర్మ్ అనే వార్తలు కూడా వచ్చాయి. కాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ పై వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హృద్యమైన లవ్ స్టోరీ సిరీస్ ఆషికీ 3 లో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు.
అందుకు సంబంధించి రెండు వీడియో క్లిప్స్ ని నిన్న లవర్స్ డే సందర్భంగా కార్తీక్ ఆర్యన్ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోస్ లో కార్తీక్, శ్రీలీల లవ్ సీన్స్ చూడవచ్చు. ప్రముఖ దర్శకడు అనురాగ్ బసు గ్రాండ్ గా రూపొందిస్తున్న ఈ లవ్, రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. మరి ఈ తొలి చిత్రం ద్వారా బాలీవుడ్ ఆడియన్స్ ని శ్రీలీల ఎంతమేర ఆకట్టుకుంటారో చూడాలి.
Sreeleela vs Other Actresses – Who Will Star in Aashiqui 3?
What's Your Reaction?






